Dead body in car: కారు డిక్కీ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేసి చూడగా.. కళ్లు బైర్లు..!
సహోద్యోగితో స్నేహం చేయడమే ఆమెపాలిట శాపమైంది. పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలొస్తాయని నమ్మించాడు.. చివరకు డబ్బుల విషయంపై ఆమె నిలదీయడంతో.. మహిళను హత్యచేశాడు.
సహోద్యోగితో స్నేహం చేయడమే ఆమెపాలిట శాపమైంది. పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలొస్తాయని నమ్మించాడు.. చివరకు డబ్బుల విషయంపై ఆమె నిలదీయడంతో.. మహిళను హత్యచేశాడు. అనంతరం ఆమె శవాన్ని కారు డిక్కీలో ఉంచాడు. నాలుగు రోజుల తర్వాత కారు నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. భిలాయికి చెందిన ప్రియాంక సింగ్ అనే యువతి దయాల్‌బంద్ ప్రాంతంలో నివసిస్తూ.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రియాంక కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా.. చివరగా తన సహోద్యోగి ఆశిశ్‌తో మాట్లాడినట్లు నిర్ధారణ అయింది.దీంతో అశిశ్ సాహూను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో దాచిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారు డోరు తెరవగా.. మృతదేహం కుళ్లిపోయి, ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతుడు బిలాస్‌పూర్‌లోని ఆశిశ్ సాహు తిక్రపరా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మహిళతో స్నేహం పేరుతో పరిచయమై.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

