Teddy bear Viral: ఊపిరి తీసుకుంటున్న టెడ్డీబేర్.. అనుమానంతో చెక్ చేస్తే అసలు విషయం తెలిసి షాక్..!
యూకేలో పోలీసులు జైలు శిక్ష పడిన ఓ కారు దొంగను అదుపులోకి తీసుకునేందుకు ఓ ఇంటికి వచ్చారు. 18 ఏళ్ల జాషువా డాబ్సన్ అనే యువకుడు కారును దొంగిలించాడని.. అదే రోజు బంక్‌లో పెట్రోల్ కొట్టించుకుని...
యూకేలో పోలీసులు జైలు శిక్ష పడిన ఓ కారు దొంగను అదుపులోకి తీసుకునేందుకు ఓ ఇంటికి వచ్చారు. 18 ఏళ్ల జాషువా డాబ్సన్ అనే యువకుడు కారును దొంగిలించాడని.. అదే రోజు బంక్‌లో పెట్రోల్ కొట్టించుకుని డబ్బు ఇవ్వకుండా పరారయ్యాడని అభియోగాలు నమోదయ్యాయి. నేర నిరూపణ అవ్వడంతో కోర్టు అతడికి తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో పోలీసులకు అతను ఓ ఇంట్లో ఉన్నాడని సమాచారం రావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు పోలీసులు. కానీ ఈ ఇంట్లో అణువణువు వెతికినా నిందితుడు కనిపించలేదు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పెద్ద టెడ్డీబేర్‌పై వారి ఫోకస్ పడింది. ఎందుకంటే ఆ టెడ్డీబేర్ ఊపిరి తీసుకుంటూ కనిపించింది. దీంతో కాప్స్‌కు అసలు విషయం అర్థమయ్యింది. వెంటనే లోపల నక్కి ఉన్న దోషిని అదుపులోకి తీసుకున్నారు. దొంగ తమనుంచి తప్పించుకోడానికి ఈ ప్లాన్ వేశాడని.. కానీ అది బెడిసికొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై వేలాది మంది సోషల్ మీడియా నెటిజన్లు స్పందింస్తున్నారు. అరెస్టు సమయంలో అధికారి బాడీ క్యామ్ ఫుటేజీని విడుదల చేయాలని పలువురు పోలీసు శాఖను కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

