నీళ్లలో పడిపోయిన కుక్క.. కాపాడటం కోసం ఆ యువకులు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..

ప్రస్తుతం సమాజంలో మనిషికి మనిషికి మధ్య అనురాగాలు, బంధాల మధ్య దూరం పెరిగిపోయింది. ఇక మన పక్కనే అచేతనంగా పడి ఉన్న వ్యక్తి దగ్గరికి

నీళ్లలో పడిపోయిన కుక్క.. కాపాడటం కోసం ఆ యువకులు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..
Viral Video

Updated on: May 02, 2021 | 10:48 AM

ప్రస్తుతం సమాజంలో మనిషికి మనిషికి మధ్య అనురాగాలు, బంధాల మధ్య దూరం పెరిగిపోయింది. ఇక మన పక్కనే అచేతనంగా పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లడానికి సైతం ఇష్టపడకుండా మారిపోయారు. ఇక ప్రస్తుతం కరోనా కాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇక ఒక వ్యక్తి నీళ్లలో పడిపోయాడు అంటే మాత్రం.. స్మార్ట్ ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో సో సాడ్ అంటూ ఎమోషనల్ ట్వీట్ ఇస్తుంటారు. కానీ కొందరు యువకులు మాత్రం అలా కాకుండా.. నీళ్లలో పడి ప్రాణాలను కాపాడుకోవడం తాపత్రాయ పడుతున్న కుక్కకు తమ వంతు సహయాన్ని అందించి దాని ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో రోడ్డు పక్కనే ఉన్న ఓ కాలువలో ఓ కుక్క పడిపోయింది. ఇంకేముంది.. బయటకు రావడానికి అది ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఇక అదే దారిన వెళ్తున్న యువకులు ఆ కుక్కను గమనించారు. వెంటనే దానిని కాపాడటం ఆ కాలువలోకి దూకాడు. ఇక తన రెండు కాళ్ళ మధ్యలో ఆ కుక్కను పట్టుకొని ఒడ్డున ఉన్న వారి వద్దకు వచ్చి.. దానిని వారికి అందించాడు. ఇక ఆ తర్వాత దానిని రోడ్డుపై వదిలేసారు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్వి్ట్టర్ లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 27 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..

ట్వీట్..

Also Read: Tirupati By Election Results 2021 LIVE: తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. ముందంజలో వైసీపీ..!

Tamil Nadu Kerala Puducherry Election Results 2021 LIVE: తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్ అధిక్యం

West Bengal, Assam Election Results 2021 LIVE: ఈశాన్యంలో పాగా వేసేదెవరు..? బెంగాల్‌లో టీఎంసీ-బీజేపీ మధ్య హోరాహోరీ.. అస్సాంలో ఎన్డీఏ..