Funny Video: ప్రేమలో పడితే ఇంతేనేమో.. ఈ యువకుడి కష్టం ఎవరికీ రాకూడదు.. వీడియో.

Funny Video: ప్రేమలో పడితే ఇంతేనేమో.. ఈ యువకుడి కష్టం ఎవరికీ రాకూడదు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 15, 2023 | 9:21 PM

ఓ యువకుడు తన స్నేహితులతో గడపాలని టూర్ వెళ్లాడు. తన ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే టైమ్‌లో అతని లవర్ కాల్ చేసి తనతో మాట్లాడాలని కోరుతుంది. స్నేహితులతో ఒక్క సెల్ఫీ తీసుకుని వస్తానని చెప్పినా కూడా..

యువకులు ప్రేమలో పడగానే స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించేస్తారు… కాదు కాదు అంత ఛాన్స్‌ ఉండదింక. ప్రేయసి నుంచి తప్పించుకుని కాసేపు ఫ్రెండ్స్‌తో గడుపుదామనుకున్న ఓ యువకుడి కష్టాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన స్నేహితులతో గడపాలని టూర్ వెళ్లాడు. తన ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే టైమ్‌లో అతని లవర్ కాల్ చేసి తనతో మాట్లాడాలని కోరుతుంది. స్నేహితులతో ఒక్క సెల్ఫీ తీసుకుని వస్తానని చెప్పినా కూడా.. ఆమె ఒప్పుకోదు. మరోవైపు అతని స్నేహితులు, అతన్ని సెల్ఫీ దిగడానికి రావాలని పిలుస్తారు. ఇటుపక్కన గర్ల్‌ ఫ్రెండ్‌ ఫోన్‌లో వదలట్లేదు. నా ఫ్రెండ్స్‌ అంతా సరదాగా గడుపుతున్నారు. నాకు ఒక్క సెల్ఫీ దిగే అవకాశం కూడా ఇవ్వవా… సరే మాట్లాడు.. మాట్లాడు అంటూ ఏడ్చుకుంటూ చెబుతాడు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో నవ్విస్తోంది. అతని పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలో పడితే ఇంతేనని కొందరు, ఆ అమ్మాయి ఇలా ప్రవర్తించడం తప్పు అని మరి కొందరు చెబుతున్నారు. భయ్యా..ప్రస్తుతం మాదీ అదే పరిస్థితి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..