HIV: షాక్.. ఒకే జైల్లో మహిళలతో సహా 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్..
ఉత్తరాఖండ్‌లోని హల్ద్‌వాని జైల్లో హెచ్ఐవీ కలకలం సృష్టిస్తోంది. ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారిలో 44 మంది ఖైదీలు హెచ్ఐవీ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో ఒక మహిళా ఖైదీ కూడా ఉండటం గమనార్హం. అయితే..
ఉత్తరాఖండ్‌లోని హల్ద్‌వాని జైల్లో హెచ్ఐవీ కలకలం సృష్టిస్తోంది. ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారిలో 44 మంది ఖైదీలు హెచ్ఐవీ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో ఒక మహిళా ఖైదీ కూడా ఉండటం గమనార్హం. అయితే హెచ్ఐవీ బారిన పడ్డ ఖైదీలందరికీ జైల్లోనే చికిత్స అందిస్తున్నట్లు సుశీలా తివారీ హాస్పిటల్, ఏఆర్‌టీ సెంటర్ ఇంచార్జ్ డాక్టర్ పరంజిత్ సింగ్ తెలిపారు. కారాగారంలో హెచ్ఐవీ రోగుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోగులందరికీ యాంటీరిట్రోవైరల్ థెరపీ కొనసాగిస్తున్నామని చెప్పారు. జైల్లో ఉన్న ఖైదీలందరికీ రెగ్యులర్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం హెచ్ఐవీ బారిన పడిన ఖైదీలకు ఉచితంగానే వైద్యం, మెడిసిన్స్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. హల్ధ్‌వాని జైల్లో ప్రస్తుతం 1629 మంది పురుష ఖైదీలు, 70 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. మిగతా వారికి హెచ్ఐవీ సోకకుండా ఉండేందుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే హెచ్‌ఐవీ సోకినవారంతా డ్రగ్స్ బానిసలేనని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

