RGV Emotional: వర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా..? ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్..
సోషల్ మీడియాలో జంతువులతో పాటు వివిధ రకాల జీవులకు సంబంధించిన వీడియోలు మనం రోజూ చూస్తుంటాం. వాటిలో కొన్ని ఎమోషనల్ వీడియోలు కూడా ఉంటాయి.
సోషల్ మీడియాలో జంతువులతో పాటు వివిధ రకాల జీవులకు సంబంధించిన వీడియోలు మనం రోజూ చూస్తుంటాం. వాటిలో కొన్ని ఎమోషనల్ వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోను కాంట్రవర్సీకి కేరాఫ్‌గా చెప్పుకునే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ పోస్ట్ చేసారు. వర్మ ఏంటి.. ఎమోషనల్ పోస్ట్ ఏంటి అనుకుంటున్నారా… అవును, వర్మ ఓ బాతుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. మనుషులకే కాదు వీటికీ ఎమోషన్స్ ఉంటాయి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే… ఈ వీడియోలో ఓ చోట చిన్న నీటి గుంటలాంటిది ఉంది. దానిపైన పక్షులకు ఆహారం వేసి రెండు ట్రేలు ఉన్నాయి. అక్కడ ఓ బాతు, మరో పక్షి గింజలు తింటున్నాయి. ఇంతలో ఆ ట్రేల కింద ఉన్న చేపలు ఆహారం కోసం వెతుకుతున్నాయి. అది గమనించిన బాతు తను తినే గింజలను ఆ చేపలకు స్వయంగా తన నోటితో అందిస్తుంది. బాతు అందిస్తోన్న ఆహారం అందుకునేందుకు చేపలు ఒకదాని వెంట ఒకటి అక్కడికి చేరుకుని గింజలను అందుకుంటూ ఆరగిస్తున్నాయి. ఈ వీడియోను రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..