Diamonds: కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది.!

Diamonds: కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది.!

Anil kumar poka

|

Updated on: Jul 29, 2024 | 11:16 AM

ఒక్క వజ్రం అతని జీవితాన్నే మార్చేసింది. ఇన్నాళ్లూ అతను పడిన కష్టానికి తగిన ఫలితాన్ని అందించింది. రెండు నెలల క్రితం లీజుకు తీసుకున్న గనిలో ఖరీదైన వజ్రం ఆ కష్టజీవికి లభించింది. దాంతో అతని ఆనందానికి అవధుల్లేవు. తన కుటుంబం కష్టాలు గట్టెక్కుతాయని, తన పిల్లలకు మంచి చదువు చెప్పించగలుగుతానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఒక్క వజ్రం అతని జీవితాన్నే మార్చేసింది. ఇన్నాళ్లూ అతను పడిన కష్టానికి తగిన ఫలితాన్ని అందించింది. రెండు నెలల క్రితం లీజుకు తీసుకున్న గనిలో ఖరీదైన వజ్రం ఆ కష్టజీవికి లభించింది. దాంతో అతని ఆనందానికి అవధుల్లేవు. తన కుటుంబం కష్టాలు గట్టెక్కుతాయని, తన పిల్లలకు మంచి చదువు చెప్పించగలుగుతానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో రాజు గౌఢ్‌ అనే వ్యక్తికి 19.22 క్యారెట్‌ డైమండ్‌ దొరికింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి హద్దుల్లేవు. ప్రభుత్వ వేలంలో దీని విలువ రూ.80 లక్షలు, అంతకన్నా ఎక్కువ ధర పలకవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇంతటి అదృష్టం వస్తుందని ఊహించలేదని రాజు తెలిపాడు. గతంలో తాను ట్రాక్టర్‌ నడిపేవాడినని, తన కుటుంబం కూలీ పనులతోనే జీవనోపాధి పొందేదని రాజు చెప్పుకొచ్చాడు. ఏదో ఒకరోజు ఇలాంటి అదృష్టం వరించక పోతుందా అనే ఆశతో గత పదేళ్లుగా వర్షాలు కురుస్తున్న సమయంలో చిన్న పాటి గనుల్ని లీజుకు తీసుకుంటుండేవాడినని, ఈ వజ్రం దొరికిన గనిని కూడా రెండు నెలల క్రితమే లీజుకు తీసుకున్నట్లు తెలిపాడు. ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో తన పిల్లల చదువుతో పాటు వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ సురేష్‌ కుమార్‌ స్పందించారు. ఈ విలువైన వజ్రాన్ని తదుపరి వేలంలో విక్రయానికి ఉంచనున్నట్లు పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.