Tomato Price: ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
గతేడాది టమాట ధర అమాంతం పెరిగి టమాట రైతుల ఇంట సిరులు కురిపించింది. కొందరు రైతులను లక్షాధికారులను చేసింది. ఆ సమయంలో టమాటా చోరీలకు పాల్పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ఎందుకంటే రోజురోజుకీ టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది టమాటా లేనిదే వంట చేయలేరు. టమాటా ధర చూస్తే సెంచరీ దాటుతోంది.
గతేడాది టమాట ధర అమాంతం పెరిగి టమాట రైతుల ఇంట సిరులు కురిపించింది. కొందరు రైతులను లక్షాధికారులను చేసింది. ఆ సమయంలో టమాటా చోరీలకు పాల్పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ఎందుకంటే రోజురోజుకీ టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది టమాటా లేనిదే వంట చేయలేరు. టమాటా ధర చూస్తే సెంచరీ దాటుతోంది. ఈ నేపధ్యంలో విశాఖ రైతుబజార్లో కిలో టమాటా రూ.40 లకే లభించడంతో తెల్లవారుతూనే రైతుబజార్ ముందు బారులు తీరుతున్నారు జనం. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల విశాఖ రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు కిలో టమాటా 100 విక్రయించారు. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ.. హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. టమాటతో పాటు అన్ని రకాల కూరగాయల ధరలూ పెరిగాయి. ఒక్కసారిగా భగ్గుమన్న టమాటా ధరతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు. మార్కెట్‌లో టమాటా ధర పెరుగుదలతో అధికారులు రాయితీపై సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. టోకున కొన్న ధరకే రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు చేపట్టారు.
విశాఖలో టమాటాకు భారీ డిమాండ్ పెరిగింది. బహిరంగ మార్కెట్లో 80 రూపాయల వరకు కిలో టమాట ధర పలుకుతుంది. ఈ వారంలో విశాఖలో టమాటా కిలో ధర సెంచరీ కూడా చేరింది. దీంతో.. రైతు బజార్లలో 48 రూపాయలకే అందుబాటులో పెట్టింది ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని రైతు బజార్లలో గురువారం కిలో 48 రూపాయలకు టమాట అమ్మకాలు చేస్తున్నారు. 13 రైతు బజార్లలోను సబ్సిడీపై విక్రయిస్తున్నారు. సబ్సిడీ టమాటా కౌంటర్ల వద్ద జనం భారీగా క్యూ కడుతున్నారు. నరసింహనగర్ రైతు బజార్ వద్ద ఉదయం నుంచే జనం టమాటా కోసం బారులు తీరుతున్నారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున టమాటా ఇచ్చేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. టమాటా ధరలు తగ్గేవరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సబ్సిడీ టమాటా విక్రయిస్తామని అంటున్నారు నరసింహ నగర్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ చినబాబు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.