మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సై ని కాలితో తన్ని మరీ !!

మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సై ని కాలితో తన్ని మరీ !!

Phani CH

|

Updated on: Mar 10, 2023 | 8:47 PM

మత్తులో ఓ యువకుడు హైదరాబాద్‌లో వీరంగం సృష్టించాడు. తాగి కారు నడపడమే కాకుండా.. బ్రీత్‌ అనలైజ్‌ పరీక్షల్లో అడ్డంగా బుక్కయ్యాడు..

మత్తులో ఓ యువకుడు హైదరాబాద్‌లో వీరంగం సృష్టించాడు. తాగి కారు నడపడమే కాకుండా.. బ్రీత్‌ అనలైజ్‌ పరీక్షల్లో అడ్డంగా బుక్కయ్యాడు..పోలీసులపైనే బూతులతో విరుచుకుపడ్డాడు. బంజారా హిల్స్ లో మద్యం మత్తులో ఈ యువకుడి వీరంగం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. బ్రీత్ అనలైజ్ పరీక్షలో తాగినట్లు తేలడంతో ఆ యువకుడిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రెచ్చిపోయిన గౌరవ్‌ అనే ఈ యువకుడు ట్రాఫిక్ ఎస్ ఐ ను నానా దుర్భాషలాడుతూ తనకు హైకోర్టు జడ్జి తెల్సునని…నీమేదే కేసుపెడతానని అంటూ నానా రచ్చ చేశాడు. కారుని సీజ్‌ చేసి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. యువకుడికి బ్రీత్ అనలైజ్ పరీక్షలలో 94 పాయింట్లు వచ్చాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు పెట్టడంతో కోపంతో రెచ్చిపోయాడు. నేను నెలకు 70 వేలు సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావా? ’ అంటూ ట్రాఫిక్ ఎస్సైపై మాటలతో విరుచుకుపడ్డాడు. ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తా’ అంటూ ఎస్సైని కాలితో తన్నాడు. ఆ యువకుడి పక్కన ఉన్న యువతి సైతం ఎక్కడా తగ్గలేదు. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ ఇద్దరూ రెచ్చిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో

థైరాయిడ్‌ ముదరడంతో 21 ఏళ్ల యువతి ఏం చేసిందంటే ??

గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం

భోజనం చేసి పెళ్లిమండపంలోకి వచ్చిన అతిథులు.. అంతలోనే..

ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్‌.. ఒక్కసారిగా భూమిలోకి..

Published on: Mar 10, 2023 08:47 PM