థైరాయిడ్ ముదరడంతో 21 ఏళ్ల యువతి ఏం చేసిందంటే ??
ఆ యువతికి పుట్టుకతోనే థైరాయిడ్ వ్యాధి. ఇటీవల సమస్య మరింతగా ముదిరింది. వైద్యుల చికిత్సలేవీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. దీంతో.. తల్లిదండ్రులకు భారం కావద్దని భావించిన యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది.
ఆ యువతికి పుట్టుకతోనే థైరాయిడ్ వ్యాధి. ఇటీవల సమస్య మరింతగా ముదిరింది. వైద్యుల చికిత్సలేవీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. దీంతో.. తల్లిదండ్రులకు భారం కావద్దని భావించిన యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసరావు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి సంజయ్‌గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు. తొలుత శ్రీనివాసరావు దంపతులకు ఓ కుమార్తె జన్మించగా.. ఆ మరుసటి కాన్పులో ముగ్గురు కవలలు పుట్టారు. వీరిలో 21 ఏళ్ల దివ్యకు పుట్టుకతోనే థైరాయిడ్ వ్యాధి ఉంది. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతోంది. ఇటీవల కాలంలో వ్యాధి ముదరడంతో దివ్య మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఆమె ఫిబ్రవరి 25 ఉదయం ఇంటి వెనుక ఉరి వేసుకున్న విషయాన్ని కుటుంబీకులు గమనించారు. వెంటనే ఆమెను పరిశీలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం
భోజనం చేసి పెళ్లిమండపంలోకి వచ్చిన అతిథులు.. అంతలోనే..
ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్.. ఒక్కసారిగా భూమిలోకి..
పోగొట్టుకున్న ఫర్స్ తెచ్చిచ్చిన యువకుడు.. సంబరపడిపోయిన మహిళ ఏం చేసిదంటే ??
బీచ్‌లో కొట్టుకొచ్చిన వింత బంతి.. భయం భయంగా.. దగ్గరకు వెళ్లి చూడగా