పోగొట్టుకున్న ఫర్స్ తెచ్చిచ్చిన యువకుడు.. సంబరపడిపోయిన మహిళ ఏం చేసిదంటే ??
అతిథి దేవో భవ.. అన్న సూక్తిని తూ.చా తప్పకుండా పాటించాడో భారతీయ యువకుడు. అతడు నిండు మనసుతో చేసిన ఉపకారానికి ఓ అమెరికా మహిళ సంబరపడిపోయింది.
అతిథి దేవో భవ.. అన్న సూక్తిని తూ.చా తప్పకుండా పాటించాడో భారతీయ యువకుడు. అతడు నిండు మనసుతో చేసిన ఉపకారానికి ఓ అమెరికా మహిళ సంబరపడిపోయింది. భారత్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ అమె ఇటీవల ఇన్‌స్టాలో పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాలో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆమె ట్రైన్‌లో తన పర్సు మర్చిపోయి స్టేషన్‌లో దిగిపోయింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వీడియోలో వెల్లడించింది. గుజరాత్‌కు చెందిన చిరాగ్ అనే యువకుడు ఆ పోస్టును చూసి వెంటనే స్పందించాడు. ‘‘మీ పర్సు నాకు దొరికింది’’ అంటూ ఇన్‌స్టా వేదికగానే మెసేజ్ ఇచ్చాడు. భుజ్ ప్రాంతంలో తనకో రెస్టారెంట్ ఉందని, అక్కడికొచ్చి వ్యాలెట్ పట్టుకెళ్లమని తెలిపాడు. దీంతో.. పోయిన పర్సు దక్కడంతో ఆమె తెగ సంబరపడిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీచ్‌లో కొట్టుకొచ్చిన వింత బంతి.. భయం భయంగా.. దగ్గరకు వెళ్లి చూడగా
పెళ్లి ఊరేగింపులో కోట్ల విలువైన కార్లు.. అయినా వాటిని వదిలి వింతగా ఎంట్రీతో షాక్ ఇచ్చిన వరుడు