Snake Video: పామాయిల్ తోటలో ప్రత్యక్షమైన తొమ్మిదడుగుల గిరి నాగు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Snake Video: అడవుల్లో ఉండాల్సిన పాములు ఇటీవల జనావాసాల్లోకి రావడం ఎక్కువై పోతోంది. దారి తప్పి వస్తున్నాయో, వాటికి అవసరమైన వనరులు లభించక వస్తున్నాయో కానీ..

Snake Video: అడవుల్లో ఉండాల్సిన పాములు ఇటీవల జనావాసాల్లోకి రావడం ఎక్కువై పోతోంది. దారి తప్పి వస్తున్నాయో, వాటికి అవసరమైన వనరులు లభించక వస్తున్నాయో కానీ.. ప్రజలను మాత్రం తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే ఒకప్పటిలా పాము కనిపించగానే చంపేయడం కాకుండా ప్రజలు స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇచ్చి సురక్షితంగా వాటిని అడవుల్లోకి వదులుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి విశాఖ జిల్లాల మాడుగు మండలం భవాని పాలెంలో జారగింది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల భవాని పాలెంలోని పామాయిల్ తోటలో రైతులు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ పెద్ద గిరి నాగు చెట్ల కుప్పలోకి వెళ్లిపోయింది. తొమ్మిది అడుగుల నాగుపాము భుజలు కొడుతుండడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన కొందరు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
చోడవరం ఫారెస్ట్ రేంజర్ రామ్ నరేష్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్‌లు పామును జాగ్రత్తగా బంధించారు. అనంతరం గిరి నాగును శంకరం మండలం అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తొమ్మిది అడుగులు పాము రయ్యి రయ్యి మంటూ దూసుకెళుతుంటే స్థానికులంగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Holidays 2022: వచ్చే ఏడాది సెలవులు, పండుగలు ఇవే.. జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం