Indian Students: భారతీయ విద్యార్థుల మరణాలు కెనడాలోనే ఎందుకు ఎక్కువ.? 403 మంది మృతి.

Indian Students: భారతీయ విద్యార్థుల మరణాలు కెనడాలోనే ఎందుకు ఎక్కువ.? 403 మంది మృతి.

Anil kumar poka

|

Updated on: Dec 11, 2023 | 9:43 AM

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అని వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇటీవలే పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇలా పలు కారణాలతో విద్యార్థులు మరణిస్తున్నారు. అలా 2018 నుంచి ఇప్పటి వరకూ 400 మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో మృత్యువాత పడినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అని వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇటీవలే పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇలా పలు కారణాలతో విద్యార్థులు మరణిస్తున్నారు. అలా 2018 నుంచి ఇప్పటి వరకూ 400 మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో మృత్యువాత పడినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడా లోనే చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ రాజ్యసభ లో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. 2018 నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 34 దేశాల్లో 403 మంది భారతీయులు వివిధ కారణాలతో మరణించినట్లు చెప్పారు. మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం.. అత్యధికంగా కెనడాలోనే 91 మంది మృతి చెందారు. ఆ తర్వాత యూకేలో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20, సైప్రస్‌లో 14, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో 10 మంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, అత్యధికంగా కెనడాలోనే భారతీయ విద్యార్థులు మరణించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చిని ప్రశ్నించగా.. ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సమస్య అవునో కాదో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఇందులో కొన్ని వ్యక్తిగత కారణాలతో చోటుచేసుకున్న మరణాలు ఉన్నాయని, కుట్రలు, ఇతర కారణాలతో చోటుచేసుకున్న మరణాలపై ఇప్పటికే మా కాన్సులేట్‌ అధికారులు ఆయా కుటుంబాలను సంప్రదించాయని తెలిపారు. అలాంటి కేసులను తాము స్థానిక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని బాగ్చి వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.