67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు

భారత తీర గస్తీ దళానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. అత్యవసర ఆపరేషన్‌కు వెళ్తుండగా అరేబియా సముద్రంపై ఎమర్జెన్సీ ల్యాండ్‌ అవుతూ కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది ఒకరిని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పోర్‌బందర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న మోటార్‌ ట్యాంకర్‌ ఓడలో ఓ సిబ్బందికి తీవ్ర గాయమైంది.

67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు

|

Updated on: Sep 05, 2024 | 10:03 PM

భారత తీర గస్తీ దళానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. అత్యవసర ఆపరేషన్‌కు వెళ్తుండగా అరేబియా సముద్రంపై ఎమర్జెన్సీ ల్యాండ్‌ అవుతూ కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది ఒకరిని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పోర్‌బందర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న మోటార్‌ ట్యాంకర్‌ ఓడలో ఓ సిబ్బందికి తీవ్ర గాయమైంది. దీంతో ఆ ఓడ నుంచి తీర గస్తీ దళానికి అత్యవసర సందేశం అందింది. గాయపడిన వ్యక్తిని తరలించేందుకు సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కోస్ట్‌గార్డ్‌కు చెందిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ బయల్దేరింది. మార్గమధ్యలో ఇందులో సమస్య తలెత్తి సముద్రంపై ఎమర్జెన్సీ ల్యాండ్‌ అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సమయంలో అందులో నలుగురు సిబ్బంది ఉన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Saripodhaa Sanivaaram: రూ.100 కోట్ల దిశగా ‘సరిపోదా శనివారం’

దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని

‘రివెంజ్ సేవింగ్స్’ చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి

“కాందహార్ హైజాక్‌” వెబ్‌సీరీస్‌ కాంట్రవర్సీ.. నెట్‌ఫ్లిక్స్ బాస్‌కు సమన్లు

‘కిల్లర్’ తోడేళ్లకు.. చిన్నారుల మూత్రంతో తడిపిన బొమ్మలు ఎర

Follow us