Viral: ఒకమ్మాయి.. ముగ్గురబ్బాయిలు.. అద్దెకు ఉంటామని ప్లాట్‌లో దిగారు.. చివరకు ఏం చేశారంటే..
ప్లాట్ అద్దెకు తీసుకున్నారు.. కానీ, వారు మాత్రం ఉండేందుకు కాదు.. మరెందుకనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ వింటే షాకవ్వాల్సిందే.. గంజాయ్ సాగు చేసేందుకు.. ప్లాట్ ను తనిఖీ చేసిన పోలీసులు.. దెబ్బకు షాకయ్యారు. గుజరాత్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. హైటెక్ స్థాయిలో గంజాయి సాగు చూసి ఖాకీలే షాకయ్యారు.
ప్లాట్ అద్దెకు తీసుకున్నారు.. కానీ, వారు మాత్రం ఉండేందుకు కాదు.. మరెందుకనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ వింటే షాకవ్వాల్సిందే.. గంజాయ్ సాగు చేసేందుకు.. ప్లాట్ ను తనిఖీ చేసిన పోలీసులు.. దెబ్బకు షాకయ్యారు. గుజరాత్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. హైటెక్ స్థాయిలో గంజాయి సాగు చూసి ఖాకీలే షాకయ్యారు. మొక్కలు పెరగడానికి గది ఉష్ణోగ్రతను అత్యాధునిక పద్ధతిలో కరెంట్‌ను ఉపయోగించి పెంచారు. సాధారణంగా గంజాయిని నేలపైన సాగు చేయడం చూసి ఉంటాం. ఇందుకు పూర్తి భిన్నంగా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని కృత్రిమంగా సాగు చేస్తోంది ఈ ముఠా. ఈ హైటెక్ గంజాయి సాగును అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో గుర్తించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా.. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
నిందితులు గంజాయి మొక్కలను అత్యాధునిక పద్ధతిని ఉపయోగించి గది ఉష్ణోగ్రతను నియంత్రించేలా ఏర్పాట్లు చేశారు. రెండు ఫ్లాట్లను 35వేలకు లకు రెంట్‌కి తీసుకున్నారు. ఒక్కో ఫ్లాట్‌లో 100 మొక్కలను పెంచేలా ఏర్పాట్లు చేశారు. మొక్కలు తొందరగా పెరిగేలా అమైనో యాసిడ్ ఇంజక్షన్లను ఉపయోగించారు. వీరి నుంచి 200 గంజాయి మొక్కల కుండీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు పోలీసులు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..