Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తన పెళ్లి బరాత్‌లో తానే డ్యాన్స్ వేసిన వరుడు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు.

Viral Video: తన పెళ్లి బరాత్‌లో తానే డ్యాన్స్ వేసిన వరుడు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Groom Dance
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2021 | 11:56 PM

Viral Video: ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, ఆ ప్రయోగాలు సక్సెస్ అయితే ప్రశంసలు అందుకుంటారు. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మాత్రం అడ్డంగా బుక్కైపోతారు. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఆడేసుకునేందుకు రెడీగా ఉంటారు కొందరు నెటిజన్లు. తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు తన వివాహం సందర్భంగా ఏర్పాటు బరాత్‌లో ఆడవాళ్లతో కలిసి తానొక్కడే డ్యాన్స్ చేశాడు. అయితే, ఆ డ్యాన్స్ చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరంటే అతిశయోక్తి కాదు. అందరూ అతని డ్యాన్స్ చూసి నవ్వుకున్నారు. ఆ వీడియోలో కొందరు మహిళలు రోడ్డుపై పెళ్లి వాహనం ముందు నిలుచుని ఉండగా.. డీజే సౌండ్‌కు తగిన రీతిలో స్టెప్పులు వేస్తూ రెచ్చిపోయాడు. తనకు నచ్చిన రీతిలో వింత వింత స్టెప్పులతో డ్యా్న్స్ ఇరగదీశాడు. పెళ్లి కొడుకు డ్యాన్స్ చూసి అక్కడ ఉన్న ప్రజలు నివ్వెర పోయారు. అయితే, వరుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు 30 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు. లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకునేందుకు నిరాకరించారని కరెంట్ కట్ చేసిన అధికారులు.. గ్రామస్తులు ఏమంటున్నారంటే..