ఖరీఫ్ సీజన్‌లో రైతులు కలబందను సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కలబందను రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. కలబందను నాటడానికి జులై నుంచి ఆగస్టు మంచి సమయం. ఈ సీజన్లో కలబంద మొక్కలు నాటడం ద్వారా మంచి ఉత్పత్తి వస్తుంది. హెక్టారుకు సగటున 30-35 టన్నుల తాజా ఆకులు ఉత్పత్తి అవుతాయి. తద్వారా ఒక ఎకరానికి సులభంగా రూ .2 లక్షల వరకు సంపాదించవచ్చని రైతులు అంటున్నారు.