అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్ వీడియో
కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. గాల్లోకి లేచే సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిన ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు, ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తీవ్ర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. హంటింగ్టన్ బీచ్ వద్ద ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. గాల్లో ఉండగానే నియంత్రణ తప్పి, చక్కర్లు కొట్టింది. ఈ షాకింగ్ దృశ్యాలను అక్కడి ప్రజలు చూశారు.బీచ్‌కు సమీపంలోని ఒక హోటల్ వద్ద హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంటుండగా, అది నియంత్రణ కోల్పోయి బ్యాలెన్స్ తప్పి అక్కడే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలిన వేగానికి దాని రెక్కల ధాటికి అక్కడున్న చెట్లు కూడా విరిగిపడ్డాయి. అయితే, అదృష్టవశాత్తు, హెలికాప్టర్ కూలిన చోట నేలపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షాకింగ్ విజువల్స్‌ను ప్రస్తుతం స్క్రీన్‌పై చూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
ఇండియాలో చాట్ జీపీటీ.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ
ఒకే వ్యక్తిని ఒకే నెలలో 7 సార్లు కాటేసిన పాము
అమ్మా.. నన్నెందుకిలా వదిలేశావ్.. జాలి కలగలేదా..
చెరువులో కుప్పలు తెప్పలుగా కొట్టుకొచ్చిన కాగితాలు! ఏంటా అని చూడగా
స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ
కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..
నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను
