దిశా పటానీ ఇంట కాల్పులు.. సీఎం చెప్పారు.. బుల్లెట్ దిగింది వీడియో
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి వద్ద ఇటీవల కాల్పుల ఘటన కలకలం రేగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టమని యూపీ సీఎం యోగి హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.
ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వారిని రవీంద్ర, అరుణ్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్ ముఠా సభ్యులని చెప్పారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, పెద్దమొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేయడంతో కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించుకుంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ పటానీ ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు దిశా తండ్రి మీడియాకు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు వీడియో
విమానంలో టీ కోసం గొడవ చెట్టంత మగాడిని చావబాదిన మహిళ వీడియో
సీనియర్ నటి రమాప్రభ అల్లుడు .. తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే వీడియో
సార్.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
