Telangana: ఆ షాప్ నుంచి వేగంగా వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా.. వామ్మో.!
ఒక భారీ పాము మన దగ్గరలోకి వచ్చిందంటే చాలు.. గుండె ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. మరి ఒకే చోట రెండు పాములైతే.. ఇంకేముంది భయంతో వణికిపోతాం. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..
సాధారణంగా ఈ ప్రపంచంలో ఎక్కువమంది పాములంటేనే భయపడతారు. అక్కడ పాము ఉందని తెలిస్తే.. అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. విషపూరితమైన ఈ సర్పాలు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం పక్కా.. మరి అలాంటిది మన దగ్గరలోనే ఒకటి కాదు ఏకంగా రెండు పాములు కనిపిస్తే.. దెబ్బకు గుండె ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా స్థానిక ఎన్టీఆర్ మార్గంలో ఉన్న ఓ దుకాణంలో రెండు భారీ పాములు దూరాయి. బుధవారం రాత్రి షాప్ యజమాని పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ఏవో వింత చప్పుళ్లు వినిపించాయి. తన దుకాణంలోకి పాములు దూరినట్టు అనుమానించాడు. తక్షణమే పాములు పట్టే వ్యక్తి షేక్ యాసిన్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న షేక్ యాసిన్ వాటిని తన నైపుణ్యంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. వాతావరణం చల్లగా ఉండటంతో పాములు బయటకు రావడం సహజం అని అన్నాడు. సుమారు 8 నుంచి 10 ఫీట్లు పొడవున్న ఈ రెండు పాములను ఒకేసారి పట్టుకున్న యాసిన్.. ఆ తర్వాత సంచుల్లో వేసి వాటిని అడవిలో వదిలిపెట్టాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

