Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించారు. పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించారు. పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక అతిథిగా జపాన్ బృందం హాజరైంది. ప్రజలకు అబివాదం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలను వివరించారు. అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాని గాడిన పెట్టి.. అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. పదేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తమ లక్ష్యమన్నారు. శాంతి భద్రతల విషయంలోనూ తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు సీఎం రేవంత్. అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి పరిచయమైందన్నారు. ప్రపంచానికి పెట్టుబడుల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ సేవలందించిన పోలీసులకు మెడల్స్ ఇచ్చారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌కు వెళ్లారు. గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.
