Girl Fights off Wild Bear: పెంపుడు కుక్కల కోసం ప్రాణాలకు తెగించి ఎలుగుబంటితో పోరాడిన యువతి.. వీడియో వైరల్..

Girl Fights off Wild Bear: పెంపుడు కుక్కలను చాలా మంది తమ కుటుంబ సభ్యుడితో సమానంగా భావిస్తుంటారు. దానికి ఏమైనా అయితే భరించలేరు.

Girl Fights off Wild Bear: పెంపుడు కుక్కల కోసం ప్రాణాలకు తెగించి ఎలుగుబంటితో పోరాడిన యువతి.. వీడియో వైరల్..
Wild Bear
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 02, 2021 | 11:34 AM

Girl Fights off Wild Bear: పెంపుడు కుక్కలను చాలా మంది తమ కుటుంబ సభ్యుడితో సమానంగా భావిస్తుంటారు. దానికి ఏమైనా అయితే భరించలేరు. అలాంటిది ప్రమాదం ముంచుకొస్తే చూస్తూ ఉరుకుంటారా? సాధ్యమైనంత వరకు దాన్ని కాపాడేందుకే ప్రయత్నిస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కాలిఫోర్నియాలో వెలుగు చూసింది. ఓ యువతి ప్రాణాలకు తెగించి.. భయంకరమైన ఎలుగుబంటి నుంచి తన పెంపుడు కుక్కను కాపాడుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాలిఫోర్నియాలోని బ్రాడ్‌ఫోర్డ్‌లో గోడపై నడుచుకుంటూ ఓ ఎలుగుబంటి దాని రెండు పిల్లలు ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. అయితే, ఇంట్లోని పెంపుడు కుక్క, దాని పిల్లలు ఆ ఎలుగుబంటిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎలుబంటిని భయపెట్టిస్తూ గట్టిగా అరిచాయి. దాంతో పిల్ల ఎలుగుబంట్లు పారిపోగా.. తల్లిఎలుగుబంటి కుక్కలను ఎదిరించింది. ఇంతలో దీనిని గమనించిన ఇంట్లోని 17 ఏళ్ల హేలీ మోరినికో.. పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఉదుటున ఆ ఎలుగుబంటిని గోడ పై నుంచి కిందకు నెట్టివేసింది. ఆ వెంటనే క్షణాల వ్యవధిలోనే పెంపుడు కుక్కలను ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ ఘటన అంతా ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

కాగా, మోరినికో కుటుంబ సభ్యులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. పెంపుడు కుక్కల కోసం యువతి చేసిన సాహసాన్ని ప్రశంసించారు. ఈ వీడియోను యూట్యూబ్‌లో మంగళవారం పోస్ట్ చేయగా.. గంటల వ్యవధిలోనే 60 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. అదే సమయంలో 8.4 మిలియన్ల లైక్స్ ఆ వీడియోకు వచ్చాయి. యువతి ధైర్యానికి నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, వేసవి సమయంలో తమ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం సర్వసాధారణం అని మోరినికో పేర్కొంది.

Viral Video:

Also read:

Treasure Hunt: మంచిర్యాలలో గుప్త నిధుల కలకలం.. విచిత్రంగా పసుపు, కుంకుమ‌తో ముగ్గు వేసి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!