UPI ATM: కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చా..! వీడియో..
కార్డు లేకుండానే కేవలం ఫోన్ ద్వారా ఏటీఎంనుంచి డబ్బును విత్‌డ్రా చేసుకొనే రోజులొచ్చేస్తున్నాయి. ఈ దిశగా ముంబయిలో తొలి అడుగు పడింది. జపాన్‌కు చెందిన హితాచీ పేమెంట్ సర్వీసెస్ దేశంలో తొలి యూపీఐ-ఏటీఎంను ప్రవేశపెట్టింది. హితాచీ మనీస్పాట్ ఏటీఎం పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను సెప్టెంబరు 5న ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023 లో ఆవిష్కరించారు.
కార్డు లేకుండానే కేవలం ఫోన్ ద్వారా ఏటీఎంనుంచి డబ్బును విత్‌డ్రా చేసుకొనే రోజులొచ్చేస్తున్నాయి. ఈ దిశగా ముంబయిలో తొలి అడుగు పడింది. జపాన్‌కు చెందిన హితాచీ పేమెంట్ సర్వీసెస్ దేశంలో తొలి యూపీఐ-ఏటీఎంను ప్రవేశపెట్టింది. హితాచీ మనీస్పాట్ ఏటీఎం పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను సెప్టెంబరు 5న ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023 లో ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి దీన్ని రూపొందించినట్లు హితాచీ తెలిపింది. క్రమంగా వీటిని ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. యూపీఐ- ఏటీఎం ను ఉపయోగించడం చాలా తేలిక పైగా సురక్షితమైనది అని హితాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ సుమిల్ వికంసే తెలిపారు. ఏటీఎంలో స్క్రీన్ పైన యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత స్ర్కీన్‌పైన ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఫోన్‌లో ఉన్న యూపీఐ ఆధారిత యాప్‌తో దాన్ని స్కాన్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ పిన్‌ను యాప్‌లో ఎంటర్ చేయాలి. వెంటనే ఏటీఎం మెషీన్ నుంచి క్యాష్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ ట్రాన్జాక్షన్ సక్సెస్ అయినట్టు మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు కార్డు లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కొన్ని ఏటీఎంలలో కల్పిస్తున్నాయి. సాధారణ కార్డ్‌లెస్ ట్రాన్జాక్షన్‌లో అయితే, మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీని ధ్రువపర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, యూపీఐ ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్వయంగా మీరు మీ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తేనే డబ్బులు బయటకు వస్తాయి. ఫోన్‌లో యూపీఐ యాప్ ఉన్న ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. కార్డ్ అవసరం లేకుండానే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం నగదును పొందేలా ఈ వినూత్న విధానాన్ని తీసుకొచ్చినట్టు ఎన్‌పీసీఐ తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..