45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ వీడియో
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏటా వేల రూపాయల ప్రీమియం చెల్లించాలి. కానీ రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో ఇండియన్ రైల్వే మాత్రం 45 పైసలకే 10లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తోంది. రైళ్లలో ప్రయాణించే వారిలో చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు. ఇంతకీ ఏంటా పాలసీ.. డీటెయిల్స్ ఏంటి.?IRCTC ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తోంది.
ఈ బెనిఫిట్స్ వెరిఫైడ్, RAC, కన్ఫామ్ టిక్కెట్లకు మాత్రమే ఉంటుంది. అయితే 5 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు ఈ బీమా వర్తించదు. ఒకవేళ రైలు ప్రమాదానికి గురైతే ఈ బీమా కలిగిన ప్యాసింజర్లకు వైద్య ఖర్చులే కాక, చనిపోయినా, శాశ్వత లేదా పాక్షిక వైకల్యం కలిగినా కవరేజీ అందిస్తారు.రైల్వే ప్రమాదంలో మరణిస్తే ఈ బీమా తీసుకున్న ప్యాసింజర్ కుటుంబానికి ఈ ఇన్సూరెన్స్ పథకం కింద పది లక్షలు చెల్లిస్తుంది. శాశ్వత వైకల్యం ఏర్పడితే 10 లక్షలు, పాక్షిక వైకల్యం కలిగితే ఏడున్నర లక్షలు, తీవ్ర గాయాలైతే 2 లక్షలు చెల్లిస్తారు. మృతదేహాన్ని రవాణా చేసేందుకు 10వేల రూపాయలు ఇస్తారు. ఈ బీమా విషయంలో లయబిలిటీ పాలసీదారుడు ఇంకా కంపెనీ మధ్య ఉంటుంది. IRCTCకి దీనితో సంబంధముండదు. నిజానికి ఈ బీమా సౌకర్యం ఎప్పట్నుంచో అందుబాటులో ఉంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు. IRCTC అందించే ఈ బీమా సౌకర్యం పూర్తిగా ఆప్షనల్. ప్యాసింజర్లు కావాలనుకుంటేనే ఈ బీమా తీసుకోవచ్చు. IRCTC వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ ప్లాన్ చాలా తక్కువ మొత్తంతో భారీ మొత్తం బీమా రక్షణను అందిస్తుంది. 10 లక్షల బీమా సౌకర్యం అదీ కేవలం 45 పైసలకే ఇస్తున్నందున ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో
జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో
ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్..పడిపోయిందా ఒకే..! లేదంటే వీడియో

300 కార్లు.. 38 విమానాలు.. ఇది కదా రాయల్ లైఫ్ అంటే వీడియో

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు

పవన్ ఎఫెక్ట్.. రామ్ చరణ్, సుక్కు సినిమాకు బ్రేక్ వీడియో

ఆ వస్తువు కారణంగా.. విమానం ఎక్కకుండా ఆపిన సిబ్బంది వీడియో

అగ్నిపర్వతం బద్ధలు..విమానాలు క్యాన్సిల్ వీడియో

కాసేపట్లో అక్క పెళ్లి ఇంతలోనే ఆక్సిడెంట్లో తమ్ముడు వీడియో
