రోబో మాల్.. ప్రపంచంలోనే తొలిసారి ఎక్కడంటే?వీడియో
మొబైల్ షాపుల్లో ఫోన్లు మాత్రమే అమ్ముతారు. వస్త్రాలు, నగలు, బైక్‌లకు ప్రత్యేక షోరూంలు ఉంటాయి. మరి ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్న రోబోలకు ఇప్పటివరకు అలాంటి ప్రత్యేకమైన మాల్ ఒకటీ లేదు. రోబోల పరిశోధనలో తయారీల్లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న చైనాలో.. ఇప్పుడలాంటి పెద్ద మాల్ ఒకటి ఏర్పాటైంది. ఇంటి పనులు చేసిపెట్టే రోబోలతో పాటు ఇతర పనులు చేసిపెట్టే కొన్ని వందల రోబోలను అక్కడ అమ్మాకానికి పెట్టారు.
చైనాలోని బీజింగ్‌లో ప్రపంచంలో మొదటి రోబో మాల్ ప్రారంభమైంది. సాధారణ ప్రజలకు అక్కడ రోబోలను విక్రయిస్తారు. ఇది మొట్టమొదటి 4ఎస్ స్టోర్ అంటే, సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్, సర్వే ఇంకా కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. చైనాలో కార్ డీలర్‌షిప్‌లు ఇదే తరహాలో పని చేస్తూ ఉంటాయి. 24 వేల రూపాయల నుంచి 85 లక్షలు ఖరీదైన రోబోలు ఇక్కడ ఉంటాయి. వంట చేసే, కాఫీ పెట్టే, మందులను అందించే రోబోలు, రోబోటిక్ డాగ్స్, చదరంగం ఆడేవి, డ్యాన్సింగ్ మెషిన్స్, ఐన్‌స్టీన్, న్యూటన్ వంటి చారిత్రక సైంటిస్ట్‌ల రోబోలు ఇక్కడ దొరుకుతాయి. ఈ మాల్‌లో రోబో థీమ్డ్ రెస్టారెంట్ కూడా ఉంది. కస్టమర్లకు రోబో వెయిటర్లు ఆహార పదార్థాలను వడ్డిస్తాయి. వంట చేసేది కూడా రోబోటిక్ షెఫ్‌లే. ఇక్కడ రోబోలు ఫుట్‌బాల్ ఆడటం, ట్రాక్‌లో పరుగులు పెట్టడం చూడొచ్చు. డ్రమ్స్ వాయించడంలో శిక్షణ పొందుతూ తనను తాను మెరుగుపరచుకునే రోబోను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
