అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!
1990లో ఓ రైతు అడవిలోకి వెళ్లి దారితప్పాడు. జోరున కురుస్తున్న వర్షం నుంచి తప్పించుకోడానికి సురక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ ఓ పెద్ద గుహ దగ్గరకు చేరాడు. దాదాపు 4 అంతస్తుల ఎత్తైన గుహలో ఓ బుల్లి ప్రపంచమే ఉంది. ఓ నది ఇంకా రైన్ ఫారెస్ట్ ను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆ రైతు బ్రిటీష్ కేవింగ్ రీసెర్చ్ అసోసియేషన్‌కు తెలిపాడు.
1990లో ఓ రైతు అడవిలోకి వెళ్లి దారితప్పాడు. జోరున కురుస్తున్న వర్షం నుంచి తప్పించుకోడానికి సురక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ ఓ పెద్ద గుహ దగ్గరకు చేరాడు. దాదాపు 4 అంతస్తుల ఎత్తైన గుహలో ఓ బుల్లి ప్రపంచమే ఉంది. ఓ నది ఇంకా రైన్ ఫారెస్ట్ ను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆ రైతు బ్రిటీష్ కేవింగ్ రీసెర్చ్ అసోసియేషన్‌కు తెలిపాడు. అయితే ఆ గుహ ఉన్న ప్రాంతాన్ని అతను గుర్తుపెట్టుకోలేదు. 18 ఏళ్ల తర్వాత 2008లో దీన్ని మళ్లీ కనుగొన్నారు. ఈ గుహలో చిన్న సైజు రైన్ ఫారెస్ట్ ఉంది. అలాగే 80 అడుగుల ఎత్తైన స్పటిక శిల, చిన్న బీచ్, భూగర్భ నదులను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. హ్యంగ్ సన్ డూంగ్ గుహను ప్రపంచంలోని అతిపెద్ద గుహల్లో మూడోదిగా గుర్తించారు. ఈ గుహ ఉన్న ప్రదేశం వియత్నాం లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ భారీ గుహ బయటపడిన తర్వాత ఈ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతోంది.ఆ రైతు పేరు హొఖన్. వియత్నాంలోని ఈ గుహ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించింది. 2013 నుంచి పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మాత్రమే ఈ గుహను చూసేందుకు అనుమతి ఇస్తారు. 10 మందికి మించి ఎక్కువ మందిని ఒకేసారి అనుమతించరు.
మరిన్ని వీడియోల కోసం :
ఆగస్టులో వినాశనం.. బాబా వంగా జోస్యం నిజం కానుందా? వీడియో
నా జీవితాన్ని నాశనం చేశాడు..పుతిన్ పై రహస్య కుమార్తె కామెంట్
భయానకం పిడుగు .. వామ్మో ఆకాశమే తగలబడిందా అన్నట్లు వీడియో!
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
