Sweet Potato: చిలకడ దుంప.. చేసే మేలు ఎంతో
చిలకడదుంపలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలైనవి. పోషక విలువలతో కూడిన చిలకడ దుంపలు తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందటమే గాక.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ దీన్ని తినొచ్చు. ఇందులోని పీచు పదార్థం వల్ల.. జీర్ణ సమస్యలు దరిచేరవు. వీటీల్లోని పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపు చేస్తాయి.
దీన్ని డైట్‌లో చేర్చుకుంటే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. చిలకడదుంపలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వ్యాయామం చేసే వారికి ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. చిలకడదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో ఇది రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌కి విరుద్ధంగా పనిచేసి క్యాన్సర్ వంటి జబ్బులను నిరోధిస్తుంది. చిలకడదుంపలో బీటా-కెరోటిన్.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చిలకడ దుంపలోని విటమిన్ C, విటమిన్ E వంటి విటమిన్లు చర్మం మెరుస్తూ ఉండేందుకు, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. చిలకడదుంపలను మితంగా తీసుకోవడం ఉత్తమం. వాటిని ఆయిల్‌లో వేపితే పోషక విలువలు తగ్గిపోతాయి. కనుక వీటిని నీటిలో లేదా ఆవిరి మీద ఉడికించి తినటం మేలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాములతో ఆటలా? నదిలోకి దూకి పాముల వెలికితీత.. ఎక్కడంటే..
సన్నటి నడుము కోసం పక్కటెముకలు తొలగింపు.. డాక్టర్లు వారిస్తున్నా మొండిగా ముందుకే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

