సన్నటి నడుము కోసం పక్కటెముకలు తొలగింపు.. డాక్టర్లు వారిస్తున్నా మొండిగా ముందుకే
ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే ఓ యువతి ఎవరూ చేయని సాహసాలు చేసింది. తన నడుము సన్నగా ఉండటానికి పక్కటెముకలను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాదు.. తన అందం తరగకుండా ఉండేందుకు ఇప్పటికే చాలా సర్జరీలు చేయించుకుంది. ఇప్పటికే రెండు బ్రెజిలియన్ బమ్ లిఫ్ట్‌లు, బట్ ఇంప్లాంట్లు, రెండు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీలు, లిప్ ఫిల్లర్లు వంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది.
ప్రస్తుతం చేయించుకోబోయే రిబ్ సర్జరీ ఆమెకు ఆరవది అవుతుంది. తన శరీరాన్ని చూసి ఇతర మహిళలు అసూయపడుతున్నారని మిలా చెబుతోంది. అయితే, ఇప్పుడు తనకు బట్టలు దొరకడం చాలా కష్టంగా మారిందని కూడా ఆమె అంగీకరించింది. ఆమె శరీరం చాలా అసాధారణంగా మారింది. సాధారణ బ్రాండ్ల దుస్తులు ఆమెకు సరిపోవు. మిలా లుక్స్ చూసి సోషల్ మీడియాలో ఆమెపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఆమె శరీరంలో చాలా ప్లాస్టిక్ ఉందని, ఒక రోజు ఆమె కరిగిపోతుందంటూ చాలా మంది కామెంట్ చేశారు. కానీ మిలా ఇవన్నీ పట్టించుకోదు. తాను అందంగా ఉన్నానని, ఎవరైనా తనతో ఫోటో దిగాలనుకుంటే, తను ఖచ్చితంగా పోజు ఇస్తానని ఆమె చెబుతోంది. తమ బాయ్‌ఫ్రెండ్స్ తన వైపు ఆకర్షితులవుతారు కాబట్టి మహిళలు తనను ద్వేషిస్తారని మిలా నమ్ముతుంది. ఆమె ఇప్పుడు రష్యాలోని ఒక ఆసుపత్రిలో పక్కటెముకలు తొలగించే సర్జరీకి సిద్ధమవుతోంది. అయితే, వైద్య నిపుణులు దీనిని ప్రమాదకర దశగా భావిస్తున్నారు. అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్ ఒకరు ఈ ప్రక్రియ ఊపిరితిత్తులను కప్పి ఉంచే కణజాలాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో బాధితురాలు ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుందని చెబుతున్నారు. కానీ మిలా అవేవీ పట్టించుకోవటం లేదు.. చాలా మొండిగా ఉంది. ఆమె తన అందం కోసం ఈ యుద్ధం చేయటానికి సిద్ధపడుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

