ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్.. ధర ఎన్ని రూ.లక్షలో తెలుసా?
స్పెయిన్‌లో ఒక బ్లూ చీజ్ వేలంలో అత్యంత భారీ ధరకు అమ్ముడైంది. దీంతో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన చీజ్‌గా నిలిచింది. దీని ధర 36,000 యూరోలు అంటే, సుమారు రూ. 36 లక్షలు ధర పలికింది. 2.3 కిలోల బరువైన ఈ చీజ్.. ధరలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో చోటు దక్కించుకుంది. ఈ చీజ్ తయారీకి ఆవు పాలను ఉపయోగించడంతో పాటు... సముద్ర మట్టానికి దాదాపు 1,500 మీటర్ల ఎత్తులో ఉన్న లాస్ మాజోస్ గుహలో 10 నెలలు పరిపక్వం చెందే వరకు ఉంచారు.
ఈ గుహ సాంప్రదాయకంగా కాబ్రేల్స్ చీజ్‌ను పాతబడటానికి ఉపయోగిస్తారు. ఇక, ఈ గుహ చీజ్‌కు దాని ప్రత్యేకమైన ఆకుపచ్చ-నీలం రంగు, ఉప్పగా ఉండే రుచిని ఇస్తుంది. దీనిని ఏంజెల్ డియాజ్ హెర్రెరో జున్ను ఫ్యాక్టరీ తయారు చేసింది. అలాగే 2024 ఆగస్టు 25న స్పెయిన్‌లోని అస్టురియాస్‌లోని కాబ్రేల్స్‌లో జరిగిన వేలంలో రెగ్యులేటరీ కౌన్సిల్ డీఓపీ కాబ్రేల్స్ (స్పెయిన్) ద్వారా విక్రయించడం జరిగింది. స్పెయిన్ అంతటా తొమ్మిది క్యాటరింగ్ సంస్థలు ఈ బ్లూ చీజ్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. వేలం 3,000 యూరోలతో ప్రారంభమైంది. మొత్తం 40 బిడ్‌లు దాఖలయ్యాయి. ఘాటైన వాసన, మంచి రుచికి పేరుగాంచిన ఈ చీజ్ ను చివరికి స్పెయిన్‌లోని అస్టురియాస్‌లోని ఎల్ లగార్ డి కొలోటో రెస్టారెంట్ యజమాని ఇవాన్ సువారెజ్ కొనుగోలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కట్టు తప్పిన కన్నకూతురు.. దారుణశిక్ష విధించిన తల్లిదండ్రులు
పొద్దున్నే ఆలయానికి వెళ్లి డోర్ తీసిన అర్చకుడికి షాక్.. ఏం జరిగిందంటే..?
అన్ని లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే వారి ఆధార్ కార్డులు
నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

