AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టు తప్పిన కన్నకూతురు.. దారుణశిక్ష విధించిన తల్లిదండ్రులు

కట్టు తప్పిన కన్నకూతురు.. దారుణశిక్ష విధించిన తల్లిదండ్రులు

Phani CH
|

Updated on: Jul 23, 2025 | 4:32 PM

Share

ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కట్టు తప్పిన కన్నకూతుర్ని క్షణికావేశంలో తల్లిదండ్రులు గొంతునులిమి చంపేశారు. అనంతరం తేరుకున్న తల్లిదండ్రులు జరిగిన ఘోరానికి కన్నీటి పర్యంతమయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు కూతురు ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికారు. ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు, దర్యాప్తు చేసేసరికి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు నగరం.. మంగమూరు రోడ్డులోని జర్నలిస్ట్‌ కాలనీ 1వ లైన్‌లో కన్న కూతుర్ని తల్లిదండ్రులు గొంతు నులిమి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూలై 15వ తేదీన రాత్రి పది గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తమ కూతురు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసుల విచారణలో తామే కూతురి గొంతునులిమి హత్య చేసినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నట్టు ఒంగోలు పోలీసులు తెలిపారు. ఒంగోలులో నివాసం ఉంటున్న పల్నాటి రమేష్‌, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి పెళ్ళి చేశారు. చిన్న కుమార్తె 23 ఏళ్ళ అనూష డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు సంస్థలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసింది. కొంతకాలంగా తల్లిదండ్రుల దగ్గర ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న ఓ పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడింది. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు అనూషను మందలించారు. ఆ వ్యక్తిని తమ కూతురి జోలికి రావద్దంటూ హెచ్చరించారు. అయినా అనూష అదే వ్యక్తిని తిరిగి కలుసుకుంటుందని తెలుసుకుని జూలై 15వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో గట్టిగా మందలించారు. క్షణికావేశానికి గురైన తల్లిదండ్రులు అనూష గొంతు నులిమారు. ఈ పెనుగులాటలో అనూష ఊపిరి ఆగిపోయింది. భయపడిపోయిన తల్లిదండ్రులు అనూష ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు. అదే రోజు రాత్రి 11 గంటలకు చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకున్నట్టు వేలాడదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కూతురి మరణంపై తల్లిదండ్రులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ చేయడంతో తామే గొంతునులిమి చంపినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నట్టు ఒంగోలు తాలూకా సిఐ విజయ్‌కృష్ణ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొద్దున్నే ఆలయానికి వెళ్లి డోర్ తీసిన అర్చకుడికి షాక్‌.. ఏం జరిగిందంటే..?

అన్ని లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే వారి ఆధార్ కార్డులు

నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ

స్కూల్లో మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న చిన్నారి.. అంతలోనే..!

ఇక.. డబ్బు లేకుండానే గ్యాస్ సిలిండర్లు