పాములతో ఆటలా? నదిలోకి దూకి పాముల వెలికితీత.. ఎక్కడంటే..
నాగ పంచమి రోజున పుట్టలోని పాముకు పాలు పోసి పూజ చేస్తారు. అయితే బీహార్‌లోని ఓ గ్రామంలో విషపూరిత పాములను మెడలో వేసుకుని డాన్స్‌లు చేస్తారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా విభూతిపూర్ గ్రామంలో నాగపంచమి ఆచారం 300 ఏళ్లుగా కొనసాగుతోంది. నాగపంచమి రోజున గ్రామస్తులు సింఘియా ఘాట్‌కు చేరుకుంటారు. గంధక్ నదిలోకి దూకుతారు.
క్షణాల్లో వందలాది పాములను పట్టుకుంటారు. నది నుంచి పాములను బయటకు తీస్తారు.వాటితో పిల్లల్లా ఆడుకుంటారు. వాటిని వారి మెళ్లో వేసుకుంటారు. నోటితో స్టంట్లు చేస్తారు. గుంపులుగా పాములు చేతపట్టి రోడ్ల మీద ఊరేగింపుగా వెళతారు. అనంతరం అక్కడి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ అద్భుత భయానక ఘట్టాన్ని చూడటానికి ఇతర ప్రాంతాల జనం భారీ ఎత్తున ఘాట్‌కు తరలివస్తారు. తాము పట్టుకున్న పాములను తమ మెడలో వేలాడదీసి డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడతారు. అలా భగవతి ఆలయానికి చేరుకుంటారు. గ్రామంలో నివసించిన రౌబీ దాస్ అనే వ్యక్తి గతంలో భగవతి మాతకు గొప్ప భక్తుడిగా ఉండేవాడట. అతనే ముందుగా ఈ ప్రాంతంలో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని అంటారు. అప్పటి నుంచి అతని వారసులు గ్రామస్తులు కలిసి ఈ వేడుకను అనుసరిస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందు ఈ గ్రామంలో నాగ పంచమి పండుగ జరుపుకుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సన్నటి నడుము కోసం పక్కటెముకలు తొలగింపు.. డాక్టర్లు వారిస్తున్నా మొండిగా ముందుకే
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

