ఐపీఎల్‌ వేలంలో సరికొత్త రికార్డు.. ఆసీస్‌ ప్లేయర్లకు కాసులవర్షం

ఐపీఎల్‌ వేలంలో సరికొత్త రికార్డు.. ఆసీస్‌ ప్లేయర్లకు కాసులవర్షం

Phani CH

|

Updated on: Dec 21, 2023 | 12:23 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ వేలంలో.. కో అంటే కోట్లు పలికారు ఆటగాళ్లు. వన్డే వరల్డ్ కప్ హీరోలకు అదిరిపోయే ధర పలికింది. ఆసీస్‌ వన్డే కెప్టెన్ ప్యాట్‌ కమ్మిన్స్‌ సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్‌ స్టార్క్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2024 వేలంలో రూ.24.75 కోట్లు పలికాడు మిచెల్‌ స్టార్క్‌. రికార్డు ధరకు స్టార్క్‌ను దక్కించుకుంది కోల్‌కతా. ఆ తర్వాత స్థానంలో కమ్మిన్స్‌ ఉన్నాడు. కమ్మిన్స్‌ను 20 కోట్ల 50 లక్షల రూపాయలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ వేలంలో.. కో అంటే కోట్లు పలికారు ఆటగాళ్లు. వన్డే వరల్డ్ కప్ హీరోలకు అదిరిపోయే ధర పలికింది. ఆసీస్‌ వన్డే కెప్టెన్ ప్యాట్‌ కమ్మిన్స్‌ సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్‌ స్టార్క్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2024 వేలంలో రూ.24.75 కోట్లు పలికాడు మిచెల్‌ స్టార్క్‌. రికార్డు ధరకు స్టార్క్‌ను దక్కించుకుంది కోల్‌కతా. ఆ తర్వాత స్థానంలో కమ్మిన్స్‌ ఉన్నాడు. కమ్మిన్స్‌ను 20 కోట్ల 50 లక్షల రూపాయలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన కమిన్స్‌ కోసం ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు చూపింది. బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా పేరొందిన ఆసీస్‌ స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్‌ను 6.8 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడిన సన్‌రైజర్స్ తక్కువ ధరకే హెడ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ హసరంగను సైతం సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..

మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్‌.. కనువిందు చేస్తున్న హిమపాతం

కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల

హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??

రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నలుగురు అరెస్ట్