కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల

కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామంలో బాహుబలి అరటి గెల అందర్నీ ఆశ్చర్యం గురిచేస్తోంది. సాధారణంగా అరటి గెలకు ఐదు నుండి ఎనిమిది హస్తాలు ఉంటాయి. కానీ దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాస్ రాజు పెరట్లో ఓ అరటి గెల మాత్రం అబ్బురపరుస్తుంది. ఇటువంటి అర‌టి గెల‌ను మాత్రం మీరు చూసి ఉండ‌రు. ఎందుకంటే ఆరడుగుల పొడవున్న ఆ గెలకు 80 హస్తాలు, 3,000 కాయలు ఉన్నాయి.

కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల

|

Updated on: Dec 21, 2023 | 12:19 PM

కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామంలో బాహుబలి అరటి గెల అందర్నీ ఆశ్చర్యం గురిచేస్తోంది. సాధారణంగా అరటి గెలకు ఐదు నుండి ఎనిమిది హస్తాలు ఉంటాయి. కానీ దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాస్ రాజు పెరట్లో ఓ అరటి గెల మాత్రం అబ్బురపరుస్తుంది. ఇటువంటి అర‌టి గెల‌ను మాత్రం మీరు చూసి ఉండ‌రు. ఎందుకంటే ఆరడుగుల పొడవున్న ఆ గెలకు 80 హస్తాలు, 3,000 కాయలు ఉన్నాయి. దీంతో ఈ క్రేజీ అరటి గెలను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఈ అరటి గెలతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. గెల చుట్టూ అరటి కాయలతో విరగకాసింది. దీంతో ఈ అర‌టి గెల‌కు బాహుబ‌లి బ‌నానా అని పేరు పెట్టారు. అరటి గెల భారీగా పెరగటంతో బరువుకు చెట్టు విరగకుండా గెడలు సపోర్ట్‌గా పెట్టారు. ఇది సింగపూర్ ఆల్మండ్ కర్పూర రకం అరటని.. మలేషియా నుంచి పిలకను ప్రత్యేకంగా తెప్పించినట్లు ముదునూరి శ్రీనివాసరాజు తెలిపారు. బాహుబ‌లి అరటి గెల‌ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??

రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నలుగురు అరెస్ట్

Pallavi Prashanth: పోలీసులకు దొరకకుండా పారిపోయిన రైతుబిడ్డ

Rishab Shetty: గ్రేట్ !! రియల్‌ హీరో అనిపించుకున్న రిషబ్

Shruti Haasan: రోజూ మందు పార్టీ.. తప్పుచేశానంటూ బాధపడ్డ శృతి

Follow us