India vs Pakistan: ఆ పిచ్‌ అంత డేంజరా.? భారత్‌ Vs పాక్‌ మ్యాచ్‌పై ఆందోళన..

టీ20 ప్రపంచకప్‌ 2024... న్యూయార్క్‌లో కొనసాగుతోంది. అయితే న్యూయార్క్‌ పిచ్‌ ఇప్పుడు కాకలు తీరిన స్టార్‌ బ్యాట్స్‌మన్లకు సైతం చుక్కలు చూపిస్తుందట. బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాట్స్‌మన్స్‌ను కన్ఫ్యూజన్‌లో పడేస్తోంది. రెండు రోజుల కింద ఇదే పిచ్‌పై శ్రీలంక 77 పరుగులకు కుప్పకూలగా.. ఆ తర్వాత మ్యాచ్‌ లో ఐర్లాండ్‌ను భారత్‌ 96 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో ఈ పిచ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

India vs Pakistan: ఆ పిచ్‌ అంత డేంజరా.? భారత్‌ Vs పాక్‌ మ్యాచ్‌పై ఆందోళన..

|

Updated on: Jun 08, 2024 | 1:10 PM

టీ20 ప్రపంచకప్‌ 2024… న్యూయార్క్‌లో కొనసాగుతోంది. అయితే న్యూయార్క్‌ పిచ్‌ ఇప్పుడు కాకలు తీరిన స్టార్‌ బ్యాట్స్‌మన్లకు సైతం చుక్కలు చూపిస్తుందట. బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాట్స్‌మన్స్‌ను కన్ఫ్యూజన్‌లో పడేస్తోంది. రెండు రోజుల కింద ఇదే పిచ్‌పై శ్రీలంక 77 పరుగులకు కుప్పకూలగా.. ఆ తర్వాత మ్యాచ్‌ లో ఐర్లాండ్‌ను భారత్‌ 96 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో ఈ పిచ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ కోసం సిద్ధం చేసిన న్యూయార్క్‌ స్టేడియంలో మొత్తం 10 టహోమా గ్రాస్‌ పిచ్‌లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పెరిగే ఈ గడ్డిని ఫ్లోరిడాకు సముద్రమార్గంలో తీసుకొచ్చి అక్కడినుంచి ట్రక్కుల్లో న్యూయార్క్‌కు తరలించారు. టోర్నీ ప్రారంభానికి కొద్ది వారాల ముందే ఈ డ్రాప్‌-ఇన్‌ పిచ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది సీమ్‌కు బాగానే సహకరిస్తున్నా.. బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతుండటంతో బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

జూన్‌ 9వ తేదీన ఇదే పిచ్‌పై భారత్‌, పాక్‌ జట్లు బరిలోకి దిగనున్నాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. న్యూయార్క్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను మరో వేదికకు మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లోరిడా లేదా టెక్సాస్‌ స్టేడియాలకు మార్చాలనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఐసీసీ మాత్రం అలాంటి ఆలోచనేమీ లేదనట్లు తెలుస్తోంది. భారత్‌ – పాక్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటివరకు ఉపయోగించని పిచ్‌ను కేటాయించామని ఐసీసీ చెబుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య బౌన్స్‌ కారణంగా ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. రోహిత్‌ శర్మ భుజానికి స్వల్ప గాయమై రిటైర్డ్‌ హర్ట్‌గా వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇలాంటి ప్రమాదకరమైన పిచ్‌పై టీ20 మ్యాచ్‌ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద బీసీసీఐ ప్రస్తావించినట్లు సమాచారం. ఇలా కొత్తగా ఏదైనా ట్రాక్‌ను సిద్ధం చేసినప్పుడు ముందుగా టెస్టింగ్‌ కోసం ఇతర మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us