Smriti Mandhana : స్మృతి మంధానా గురించి 10 అరుదైన విశేషాలు

Smriti Mandhana : స్మృతి మంధానా గురించి 10 అరుదైన విశేషాలు

Phani CH

|

Updated on: Jun 08, 2024 | 8:10 PM

మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణం నుంచి ప్రపంచం మెచ్చే స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన స్టార్‌ క్రికెటర్ స్మృతి మంధాన. స్మృతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూసినట్లయితే.. చిన్నప్పటి నుంచే అన్నతో కలిసి ప్రాక్టీస్‌కు వెళ్లిన స్మృతి 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్‌–19 టీమ్‌లో చోటు దక్కించుకుంది. చదువు కంటే క్రికెట్‌ అంటేనే ఇష్టమని తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే ఇక తిరుగేలేదు.

మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణం నుంచి ప్రపంచం మెచ్చే స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన స్టార్‌ క్రికెటర్ స్మృతి మంధాన. స్మృతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూసినట్లయితే.. చిన్నప్పటి నుంచే అన్నతో కలిసి ప్రాక్టీస్‌కు వెళ్లిన స్మృతి 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్‌–19 టీమ్‌లో చోటు దక్కించుకుంది. చదువు కంటే క్రికెట్‌ అంటేనే ఇష్టమని తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే ఇక తిరుగేలేదు. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్‌ పైనే దృష్టి పెట్టింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్‌ టీమ్‌లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్‌లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళా టీమ్‌ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్‌ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది.16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్‌ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్‌ సెంచరీ 224 పరుగులు బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్‌గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో రెగ్యులర్‌ మెంబర్‌గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభుత్వమే తీసుకొస్తున్న ‘డేటింగ్ యాప్’ !! తీవ్ర ఆందోళనతో కీలక నిర్ణయం

అన్నం తిన్నతర్వాత త్రేన్పులు వస్తున్నాయా ?? కారణం ఇదే కావచ్చు !!

‘మా’ నుంచి హేమ సస్పెండ్‌ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటన

డెలివరీ తర్వాత నీళ్లు తాగకూడదా ?? తాగితే ఏమవుతుంది ??

Vijay Sethupathi: ఆమెతో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించలేను