డెలివరీ తర్వాత నీళ్లు తాగకూడదా ?? తాగితే ఏమవుతుంది ??

ప్రసవం తరువాత చాలా మంది మహిళలు అలసట, బలహీనంగా ఉంటారు. సాధారణంగా ఎవరికైనా కళ్లు తిరగడం లేదా అలసట వంటి సమస్యలు ఉంటే ముందుగా నీళ్లు తాగమని సలహా ఇస్తారు. అయితే ప్రసవం తర్వాత మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నీళ్లు తాగడం మానేయాలని ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు. కానీ, ప్రసవం తర్వాత మహిళలు తగినంత నీరు తాగకపోతే, వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

డెలివరీ తర్వాత నీళ్లు తాగకూడదా ?? తాగితే ఏమవుతుంది ??

|

Updated on: Jun 08, 2024 | 2:17 PM

ప్రసవం తరువాత చాలా మంది మహిళలు అలసట, బలహీనంగా ఉంటారు. సాధారణంగా ఎవరికైనా కళ్లు తిరగడం లేదా అలసట వంటి సమస్యలు ఉంటే ముందుగా నీళ్లు తాగమని సలహా ఇస్తారు. అయితే ప్రసవం తర్వాత మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నీళ్లు తాగడం మానేయాలని ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు. కానీ, ప్రసవం తర్వాత మహిళలు తగినంత నీరు తాగకపోతే, వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డెలివరీ అయిన వెంటనే నీళ్లు తాగడానికి, పొట్ట పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. డెలీవరి అయిన మహిళ ప్రసవం తర్వాత గోరు వెచ్చని నీరు, వేడి పాలు, సూప్‌లు మాత్రమే తాగాలని చెబుతుంటారు. డెలివరీ తర్వాత చల్లని నీరు పొరపాటున కూడా తాగకూడదని అంటుంటారు. ఎందుకంటే ఇది జలుబు, దగ్గుకు కారణం కావచ్చునని చెబుతారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి శరీరం కోలుకోవడానికి వేడిగా తీసుకునే నీళ్లు, పానీయాలు సహాయపడుతుందనేది ప్రజల్లో అనాదిగా ఓ నమ్మకం. ఇప్పటికీ ఇది ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. డెలివరీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల దీర్ఘకాలిక జలుబు వెంటాడుతుందని అంటారు. డెలీవరి అనంతరం వేడి నీళ్లు తాగటం వల్ల పొట్ట పెరగకుండా ఉంటుందని చెబుతారు. చల్లని నీరు తల్లి పాల నాణ్యత, ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుందని, నవజాత శిశువుకు కూడా చలి, జలుబు వంటివి కలిగిస్తుందని చెబుతారు. కానీ, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి డెలివరీ తర్వాత ధైర్యంగా చల్లని నీళ్లు తాగొచ్చు. అయితే ఈ నీళ్లు మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. చల్లని నీళ్లు తాగితే.. త్వరగా రికవరీ అవ్వరనే దానిలో నిజం లేదని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Sethupathi: ఆమెతో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించలేను

కొనసాగుతున్న వజ్రాల వేట.. పేదలను వరిస్తున్న వజ్రాలు

పెళ్లి ముందే ఆ ముచ్చట తీర్చుకుంటున్న స్టార్ కపుల్ ??

కాజల్‌కు ట్విస్ట్ ఇచ్చిన శంకర్.. ఊహించి ఉండదు !! పాపం !!

Follow us