Vijay Sethupathi: ఆమెతో రొమాంటిక్ సీన్స్‌లో నటించలేను
స్టార్ హీరో విజయ్ సేతుపతి త్వరలోనే మహారాజ మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్. హీరోయిన్ కృతిశెట్టితో సినిమాలు తిరస్కరించడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. తా నటించిన ‘డీఎస్పీ’ సినిమాలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయలేనని చెప్పారట. అందుకు కారణం ఉప్పెనలో కృతికి తండ్రిగా నటించడమే అన్నారు.
స్టార్ హీరో విజయ్ సేతుపతి త్వరలోనే మహారాజ మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్. హీరోయిన్ కృతిశెట్టితో సినిమాలు తిరస్కరించడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. తా నటించిన ‘డీఎస్పీ’ సినిమాలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయలేనని చెప్పారట. అందుకు కారణం ఉప్పెనలో కృతికి తండ్రిగా నటించడమే అన్నారు. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనన్నారు విజయ్ సేతుపతి. ఉప్పెనలో కొన్ని క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి కంగారు పడిందని, అప్పుడు తాను కృతితో.. నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. నన్ను నీ తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పానన్నారు. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా నటించడం తనవల్ల కాదు అని విజయ్ సేతుపతి వివరించారు. గతంలోనూ ఓ సందర్భంలో ఈ విషయాన్ని విజయ్‌సేతుపతి ప్రస్తావించారు. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయగా.. ఆయన తిరస్కరించారట. ఇక మహారాజ సినిమా విషయానికొస్తే.. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొనసాగుతున్న వజ్రాల వేట.. పేదలను వరిస్తున్న వజ్రాలు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

