‘మా’ నుంచి హేమ సస్పెండ్‌ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటన

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ మా సస్పెండ్‌ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమను సస్పెండ్‌ చేసే విషయమై బుధవారం ‘మా’ ప్యానెల్‌ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. అయితే, తుది నిర్ణయానికి రాలేదు. హేమను సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు.

‘మా’ నుంచి హేమ సస్పెండ్‌ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటన

|

Updated on: Jun 08, 2024 | 2:33 PM

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ మా సస్పెండ్‌ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమను సస్పెండ్‌ చేసే విషయమై బుధవారం ‘మా’ ప్యానెల్‌ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. అయితే, తుది నిర్ణయానికి రాలేదు. హేమను సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు మా సభ్యులకు తెలిపారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీస్ ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ‘మా’ సభ్యులకు తెలిపారు. రేవ్‌ పార్టీ విషయంలో హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మంచు విష్ణు ఇటీవల ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదనీ… నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలనీ హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుందనీ పేర్కొన్నారు. అప్పటివరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని పోస్ట్‌ చేశారు. రేవ్‌ పార్టీ కేసు విషయంలో హేమ స్పందించకపోవడంతో తాజాగా విష్ణు ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డెలివరీ తర్వాత నీళ్లు తాగకూడదా ?? తాగితే ఏమవుతుంది ??

Vijay Sethupathi: ఆమెతో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించలేను

కొనసాగుతున్న వజ్రాల వేట.. పేదలను వరిస్తున్న వజ్రాలు

పెళ్లి ముందే ఆ ముచ్చట తీర్చుకుంటున్న స్టార్ కపుల్ ??

కాజల్‌కు ట్విస్ట్ ఇచ్చిన శంకర్.. ఊహించి ఉండదు !! పాపం !!

Follow us
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు
పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు
వేగంగా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. రెండే రోజుల్లో మనిషి ఖతం
వేగంగా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. రెండే రోజుల్లో మనిషి ఖతం
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ..
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ..
జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!
జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!
పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన ఇన్విటేషన్
పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన ఇన్విటేషన్
ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్
ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!
600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!