cyclist: ‘మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి.. చెంప చెళ్ళుమనిపించేవాడు’ కోచ్ పై ఆరోపణ..

మాజీ జాతీయ సైక్లింగ్‌ కోచ్‌ ఆర్‌కే శర్మపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. భారత టాప్‌ మహిళా సైక్లిస్ట్‌.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేసింది.

cyclist: 'మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి.. చెంప చెళ్ళుమనిపించేవాడు' కోచ్ పై ఆరోపణ..

|

Updated on: Jun 21, 2022 | 3:56 PM


మాజీ జాతీయ సైక్లింగ్‌ కోచ్‌ ఆర్‌కే శర్మపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. భారత టాప్‌ మహిళా సైక్లిస్ట్‌.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆర్‌కే శర్మపై వేటు వేసింది. తాజాగా ఆర్‌కే శర్మ విషయంలో మరో టాప్‌ సైక్లిస్ట్‌.. జాతీయ చాంపియన్‌ డెబోరా హెరాల్డ్ విస్తుపోయే విషయాలు పేర్కొంది. ”ఆర్‌కే శర్మతో పాటు అతని అసిస్టెంట్‌ కోచ్‌ గౌతామని దేవి నన్ను రెండుసార్లు కొట్టారు. ప్రతీ చిన్న విషయానికి ఎగతాళి చేసేవారు. దానిని అడ్డుకోవాలని చూస్తే మరింత వేధించేవారు. అంతేకాదు మరో మహిళా సైక్లిస్ట్‌తో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా పుట్టించారు. నిజం ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు పుకార్లు పుట్టించిన ఆ సైక్లిస్ట్‌ వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అయితే దీనిని కోచ్‌ ఆర్‌కే శర్మ.. అసిస్టెంట్‌ కోచ్‌ గౌతామని దేవి వేరే రకంగా ఊహించుకునేవారు. ఒక సందర్భంలో మేము ఉన్న గదిలో ఎయిర్‌ కండీషనర్‌ పని చేయకపోవడంతో కింద ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయిల గదిలోకి వెళ్లాం. అంతకముందు వాళ్ల అనుమతి తీసుకున్నాం. ఈ విషయం తెలుసుకోకుండా కోచ్‌ ఆర్‌కే శర్మ ఆ రోజు ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.” అంటూ సంచలన విషయాలు పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. భార్యబాధితులు వింత పూజలు వైరల్‌ అవుతున్న వీడియో..

Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..