AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యకుమార్ యాదవ్ లగ్జరీ హోమ్.. షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి!

సూర్యకుమార్ యాదవ్ లగ్జరీ హోమ్.. షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి!

Phani CH
|

Updated on: Oct 27, 2026 | 4:05 PM

Share

టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన భార్య దేవిషా శెట్టితో కలిసి దుబాయ్‌లో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దుబాయ్‌ మారిటైమ్‌ సిటీలోని షారుఖ్‌జ్‌ బై డాన్యూబ్‌ ప్రాజెక్ట్‌లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో సముద్రపు దృశ్యాలతో పాటు 40కి పైగా లైఫ్‌స్టైల్‌, వెల్‌నెస్‌ సదుపాయాలు ఉన్నాయి. అయితే సూర్యకుమార్‌ కొనుగోలు చేసిన ఇంటి ఖచ్చితమైన ధర, అపార్ట్‌మెంట్‌ వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్.. దుబాయ్‌లో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. తన భార్య దేవిషా శెట్టితో కలిసి దుబాయ్‌ మారిటైమ్ సిటీలోని షారుఖ్‌జ్ బై డాన్యూబ్ ప్రాజెక్ట్‌లో ఈ ప్రాపర్టీని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్ షారుఖ్‌ ఖాన్ పేరుతో రూపొందించిన ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన కొత్త పెట్టుబడికి సంబంధించిన వీడియోను సూర్యకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్‌తో కలిసి ఉన్న వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఇంటి ఖచ్చితమైన ధరను మాత్రం ఆయన ప్రకటించలేదు. ఈ ప్రాజెక్ట్‌లో ఇళ్ల ప్రారంభ ధర సుమారు రూ.4 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌లో పూర్తిగా ఫర్నిష్ చేసిన అపార్ట్‌మెంట్లు, సముద్రపు అందాలను వీక్షించే సౌకర్యంతో పాటు 40కి పైగా లైఫ్‌స్టైల్, వెల్‌నెస్‌ ఫెసిలిటీస్‌ ఉన్నాయి. ముఖ్యంగా లాంగెవిటీ లాంజ్‌, క్రయోథెరపీ, రెడ్‌ లైట్ థెరపీ వంటి ప్రత్యేక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. షారుఖ్‌ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లోని లగ్జరీ పెంట్‌హౌస్‌ల ఇంటీరియర్ డిజైన్‌లో భాగమయ్యారు. ఇప్పటికే ముంబైలో పలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిన సూర్యకుమార్ దంపతులకు.. దుబాయ్‌లో ఇది తొలి ఇల్లుగా తెలుస్తోంది. 2025లో ముంబైలో రెండు అపార్ట్‌మెంట్లను సుమారు రూ.21.11 కోట్లకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాత 2026లో మరో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. క్రికెట్‌లో తనదైన శైలితో అభిమానులను అలరిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోనూ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. అయితే దుబాయ్‌లో ఆయన కొనుగోలు చేసిన ఇంటి ఖచ్చితమైన ధర, అపార్ట్‌మెంట్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్లలో ఇక ఆటోమేటిక్ బ్రేకులు! 2032 నుంచి కొత్త రూల్‌? డ్రైవర్ బ్రేక్ వేయకున్నా..కారే ఆగుతుంది!

Follow Us