కార్లలో ఇక ఆటోమేటిక్ బ్రేకులు! 2032 నుంచి కొత్త రూల్? డ్రైవర్ బ్రేక్ వేయకున్నా..కారే ఆగుతుంది!
భారత్‌లో వాహన భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. 2032 అక్టోబర్ నాటికి అన్ని ప్యాసింజర్ కార్లకు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌ను తప్పనిసరి చేయాలని ముసాయిదాలో పేర్కొంది. 2030 నుంచి కొత్త కార్లకు, 2032 నుంచి ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న మోడళ్లకు ఈ నిబంధన వర్తించేలా ప్రతిపాదించారు. లేన్ కీపింగ్, డ్రైవర్ అలసట గుర్తింపు, వాహనాల మధ్య సమాచార మార్పిడి వంటి ఫీచర్లపైనా మార్పులు సూచించారు.
భారత్‌లో కార్ల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. 2032 అక్టోబర్ నాటికి దేశంలో అన్ని ప్యాసింజర్ కార్లకు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. ఈ సిస్టమ్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు డ్రైవర్ స్పందించకపోతే కారు ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. దీంతో ప్రమాదాలను నివారించడంతో పాటు, ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు మోటార్ వెహికల్స్ నిబంధనల్లో మార్పులు ప్రతిపాదిస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం, 2028 అక్టోబర్ నుంచి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న వాహనాలు నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 2030 అక్టోబర్ నుంచి కొత్తగా తయారయ్యే ప్యాసింజర్ కార్లకు ఈ సిస్టమ్ తప్పనిసరి కానుంది. 2032 అక్టోబర్ నుంచి ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న మోడళ్లకూ ఈ నిబంధన వర్తించేలా ప్రతిపాదించారు. కేవలం ఆటోమేటిక్ బ్రేకింగ్ మాత్రమే కాదు.. లేన్ కీపింగ్, స్టీరింగ్ భద్రతకు సంబంధించిన నిబంధనలను కూడా దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. టాక్సీలకు డ్రైవర్ అలసటను గుర్తించే వ్యవస్థలు, లేన్ కీపింగ్ వంటి ఫీచర్లను తప్పనిసరి చేసే ప్రతిపాదన కూడా ఉంది. ట్రక్కులు, బస్సులకు ఆటోమేటిక్ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్స్, డ్రైవర్ డోజీనెస్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లను అమలు చేయాలని యోచిస్తోంది. అంతేకాదు.. 2028 అక్టోబర్ నుంచి కొత్తగా తయారయ్యే అన్ని వాహనాల్లో వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ టెక్నాలజీ ద్వారా వాహనాలు వేగం, దిశ, స్థానానికి సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోగలవు. అయితే, ఇవన్నీ ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదనలే. ప్రజల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే భవిష్యత్తులో కార్ల భద్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Honey: తేనె అంటే వాంతేనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
రిటైర్‌మెంట్ జీవితానికి బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే.. భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!
అటు భర్త.. ఇటు లవర్.. ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ..
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!
కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!

