Yashasvi Jailswal: ఒకప్పుడు టెంట్‌ కింద.. ఇప్పుడు రూ.5 కోట్ల ఇంటిని కొన్న యశస్వి జైస్వాల్.

Yashasvi Jailswal: ఒకప్పుడు టెంట్‌ కింద.. ఇప్పుడు రూ.5 కోట్ల ఇంటిని కొన్న యశస్వి జైస్వాల్.

Anil kumar poka

|

Updated on: Feb 25, 2024 | 3:30 PM

టీమిండియా డైనమిక్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. ఎవరికీ తెలియకుండా పెళ్లెప్పుడు చేసుకున్నాడబ్బా అని అనుకోవద్దు. ముంబైలోని ఖరీదైన బాంద్రాలో రూ. 5.38 కోట్లు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేసి దానికి యజమాని అయ్యాడు. నిర్మాణంలో ఉన్న టెన్ బీకేసీ ప్రాజెక్ట్‌లో 1100 చదరపు అడుగుల ఫ్లాట్‌ను జైస్వాల్ కొనుగోలు చేసినట్టు ‘మనీ కంట్రోల్’ పేర్కొంది. గత నెల 7న అది బ్యాటర్ పేరున రిజిస్టర్ అయినట్టు తెలిపింది.

టీమిండియా డైనమిక్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. ఎవరికీ తెలియకుండా పెళ్లెప్పుడు చేసుకున్నాడబ్బా అని అనుకోవద్దు. ముంబైలోని ఖరీదైన బాంద్రాలో రూ. 5.38 కోట్లు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేసి దానికి యజమాని అయ్యాడు. నిర్మాణంలో ఉన్న టెన్ బీకేసీ ప్రాజెక్ట్‌లో 1100 చదరపు అడుగుల ఫ్లాట్‌ను జైస్వాల్ కొనుగోలు చేసినట్టు ‘మనీ కంట్రోల్’ పేర్కొంది. గత నెల 7న అది బ్యాటర్ పేరున రిజిస్టర్ అయినట్టు తెలిపింది. 22 ఏళ్ల జైస్వాల్ గతేడాది జులైలో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి అద్భుతమైన ప్రదర్శనతో జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో జైస్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 109.00 సగటుతో 545 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుత ఫామ్‌తో ఉన్న బ్యాటర్‌ తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో దూసుకొచ్చాడు. ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి బ్యాటింగ్‌ విభాగంలో 15వ స్థానానికి చేరాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకొన్నాడు. బ్యాటింగ్‌ జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాపై వరుసగా సెంచరీలు చేసిన న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..