Mohammed Shami: అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ.! వరల్డ్ కప్ ప్రదర్శనతో షమీ పేరు ఎంపిక.

Mohammed Shami: అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ.! వరల్డ్ కప్ ప్రదర్శనతో షమీ పేరు ఎంపిక.

Anil kumar poka

|

Updated on: Dec 18, 2023 | 9:00 AM

దేశంలోనే రెండో అత్యున్త పురస్కారం అర్జున అవార్డ్‌కు నామినీగా ఎంపికయ్యారు భారత్ ఫేసర్‌ మహ్మద్‌ షమీ. వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన షమీ పేరును సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు నామినీల జాబితాలో తొలుత షమీకి స్థానం దక్కకపోవడంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్‌లో షమీ ప్రదర్శన దృష్ట్యా అతడిని నామినీగా పరిగణించాలని క్రీడా శాఖకు బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో..

దేశంలోనే రెండో అత్యున్త పురస్కారం అర్జున అవార్డ్‌కు నామినీగా ఎంపికయ్యారు భారత్ ఫేసర్‌ మహ్మద్‌ షమీ. వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన షమీ పేరును సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు నామినీల జాబితాలో తొలుత షమీకి స్థానం దక్కకపోవడంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్‌లో షమీ ప్రదర్శన దృష్ట్యా అతడిని నామినీగా పరిగణించాలని క్రీడా శాఖకు బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో షమీ అర్జున అవార్డు నామినీగా ఎంపికయ్యారని తెలుస్తోంది. దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు అన్న విషయం తెలిసిందే.

వరల్డ్ కప్‌లో షమీ అసామాన్య ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. టోర్నీలో కేవలం 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి అత్యధికంగా వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ నిలిచారు. శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం యావత్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేని షమీ ఆ తరువాత తన అద్భుత ప్రదర్శనతో యావత్ టోర్నీలో స్టార్‌గా నిలిచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.