టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. ఒకట్రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. అలాగే అల్లు అర్జున్తో కూడా మాట్లాడుతామని చెప్పారు. అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చేస్తామని చెప్పారు.