Crime: ఏడుగుర్ని చంపేసిన లిఫ్ట్.. 40 వ అంతస్తునుంచి అండర్ గ్రౌండ్ లో పడ్డ లిఫ్ట్.
లిఫ్ట్ మరో ఏడుగురిని మింగేసింది. అవును మహారాష్ట్ర థానేలో సెప్టెంబర్ 10న నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ కూలిపోవడంతో ఏడుగురు కూలీలు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ హైరైజ్‌అపార్ట్‌మెంట్ టెర్రస్ నుంచి కూలీలు లిఫ్ట్ ద్వారా కిందకు వస్తుండగా.. అది ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
లిఫ్ట్ మరో ఏడుగురిని మింగేసింది. అవును మహారాష్ట్ర థానేలో సెప్టెంబర్ 10న నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ కూలిపోవడంతో ఏడుగురు కూలీలు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ హైరైజ్‌అపార్ట్‌మెంట్ టెర్రస్ నుంచి కూలీలు లిఫ్ట్ ద్వారా కిందకు వస్తుండగా.. అది ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. థానే నగరంలోని ఘోడ్‌బందర్ రోడ్‌లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. సెప్టెంబర్ 10న బిల్డింగ్ టెర్రస్‌పై వాటర్‌ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. ఈ క్రమంలో సాయంత్రం ఐదున్నర గంటలకు పనులు ముగించుకుని.. కార్మికులు భవంతి పైనుంచి కిందకు లిఫ్ట్‌లో వస్తుండగా దాని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి తెగిపడింది. దీంతో లిఫ్ట్ అమాంతం ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇది నిర్మాణ పనుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదని చెప్పారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏరియా వద్ద పడిందని థానే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ అధికారి యాసిన్ తాడ్వి పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..