అల్లు అర్జున్ నా బిడ్డ చికిత్సకయ్యే ఖర్చులను చూసుకుంటున్నాడు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజురోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోందని తెలుస్తోంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు.
శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తూ మూస్తున్నాడని కానీ.. మమ్మల్ని గుర్తు పట్టే స్థితిలో లేడని ఆ చిన్నారి తండ్రి భాస్కర్ చెబుతున్నాడు. అల్లు అర్జున్ టీమ్ తన బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేస్తోందని.. అలాగే వైద్యులతో నిత్యం మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తోందని.. ఆయన చెబుతున్నాడు. మరోవైపు శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు సమయం పట్టేలా ఉందని వైద్యులంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్
Allu Arjun: అల్లు అర్జున్‌కు నెట్టింట పెరుగుతున్న సానుభూతి
దట్టమైన మంచులోనూ రైళ్లు దూసుకుపోయే టెక్నాలజీ !!
8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..
అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??
వైరల్ వీడియోలు
Latest Videos