Subrata Roy: విదేశాల్లో సహారా ఇండియా సుబ్రతా రాయ్ కుటుంబం.. ఇక ఇండియా రాదా.?
సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ మంగళవారం కన్నుమూశారు. ప్రాణాంతక మెటాస్టాటిక్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన స్థాపించిన సహారాగ్రూప్ హౌసింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సుబ్రతా రాయ్ భార్య, పిల్లలు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారు.
సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ మంగళవారం కన్నుమూశారు. ప్రాణాంతక మెటాస్టాటిక్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన స్థాపించిన సహారాగ్రూప్ హౌసింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సుబ్రతా రాయ్ భార్య, పిల్లలు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారు. సుబ్రతా రాయ్‌కు భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కుమారులు సీమాంతో, సుశాంతో రాయ్ ఉన్నారు. శుభ్రతారాయ్ కుమారుల పెళ్లిళ్లు అప్పట్లో పెద్ద సంచలనే సృష్టించాయి. ఆయన తన కుమారుల పెళ్లిళ్లకు ఏకంగా 550 కోట్లు ఖర్చు చేశారన్న ప్రచారం జరిగింది. సుబ్రతారాయ్ భార్య, కుమారుడు సుశాంతో భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్టు తెలుస్తోంది.
సుబ్రతా రాయ్ కుటుంబం ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ దేశమైన నార్త్ మాసిడోనియా పౌరసత్వం తీసుకున్నట్టు సమాచారం. భారత చట్టాల నుంచి తప్పించుకునేందుకే వారు మాసిడోనియా పౌరసత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుబ్రతా రాయ్‌పై సెబీ కేసు నడుస్తోంది. ఆయన పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సుబ్రతా రాయ్‌కి మాసిడోనియన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తుంటాయి. సుబ్రతా రాయ్ మాసిడోనియా దేశ అతిథి హోదాను కూడా అందుకున్నారు. సుబ్రతారాయ్ భార్య స్వప్నా రాయ్‌పై 2017లో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఆమె తరపున దాఖలయిన పిటిషన్‌లో.. ఆమె చట్టాన్ని గౌరవించే మహిళ అని, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పౌరురాలు అని, ఆమెకు నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. సహారా ఇండియా ఫ్యామిలీ ఛైర్మన్ భార్యగా ఆమెకు ఎల్‌ఓసీ జారీ చేశారు. మరోవైపు మాసిడోనియాలో పలు వ్యాపారాలను ప్రారంభించాలని సహారా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. అందకు మాసిడోనియా ప్రభుత్వం కూడా సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తర మాసిడోనియాలో 4 లక్షల యూరోలు పెట్టుబడిగా పెడితే అక్కడి పౌరసత్వం పొందవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.