Nandyala: పొద్దున్నే శివాలయానికి వెళ్లగా వింత శబ్దాలు.. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా..
పొద్దున్నే శివయ్యను దర్శించుకుందామని శివాలయానికి వెళ్లిన భక్తులు కంగుతిన్నారు. ఎందుకుంటే అక్కడ ప్రమాదకర రక్తపింజర పాము కనిపించింది. దీంతో భక్తులు పరుగులు తీశారు. ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెంటనే స్నేక్ క్యాచర్‌ను అక్కడికి పిలిపించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
శివరాత్రి సమీపిస్తున్న వేళ నంద్యాల శివాలయంలో పాము హల్‌చల్ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో గల శ్రీరామ థియోటర్ సమీపంలోని శివాలయంలో నాగజాతికి చెందిన రక్తపింజరి పాము జనాల్ని పరుగులు పెట్టించింది. రక్తపింజరి పాము ఆలయ పరిసరాల్లో గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తం అయిన ఆలయ నిర్వహకులు మహానందికి చెంది స్నేక్ స్నాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ రక్తపింజరి పామును పట్టుకోడానికి సుమారు గంటసేపు శ్రమించాడు. అనంతరం దేవాలయంలోని ఓ మూలకు పామును గుర్తించిన స్నేక్ స్నాచర్ చాకచక్యంగా రక్తపింజరి పామును ఓ సంచిలో బంధించాడు. బంధించిన పామును నల్లమల అడవిలో వదిలి వెయ్యడంతో అందరు ఊపిరి పిల్చుకున్నారు. నాగ సంతతిలో అరుదైన రక్తపింజరి పాము నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని ఓ శివాలయంలో కనపడటం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

