వీడు మామూలోడు కాదు.. ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు !! వీడియో
బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌ను అమ్మేశాడు.
బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌ను అమ్మేశాడు. ఇప్పుడిది రైల్వే శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. బిహార్‌లోని సమస్తీపూర్ రైల్వే డివిజన్‌లో ఓ పాత ఆవిరి రైల్ ఇంజిన్ ఉంది. ఇదే డివిజన్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ రంజన్ ఝా.. దానిపై కన్నేశాడు. నకిలీ ధృవపత్రాలతో దానిని స్క్రాప్ మాఫియాకు అమ్మేశాడు. ఈ వ్యవహారంలో రాజీవ్‌కు స్థానిక పోలీసు అధికారితో పాటు.. రైల్వే శాఖలోని ఇతర సిబ్బంది కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం డిసెంబర్ 14న చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. రైలు ఇంజిన్ అమ్మకానికి సంబంధించి నకిలీ ధృవపత్రాలను రాజీవ్ సృష్టించాడు. దాని ఆధారంగా ఇంజిన్‌ను స్క్రాప్ మాఫియాకు విక్రయించాడు. డిసెంబర్ 14వ తేదీన రాజీవ్.. రైల్వే శాఖలో ఓ హెల్పర్ సాయంతో గ్యాస్ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను స్క్రాప్‌లా మార్చే ప్రయత్నం చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Hiccups: పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి.. వీడియో
Diabetes: డయాబెటీస్ పేషంట్లకు గుడ్ న్యూస్ !! వీడియో
Credit Card: సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది ?? వీడియో
ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా !! ఇది తప్పకుండా తెలుసుకోవాలి.. వీడియో
స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

