Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోను మళ్లీ బతికించారు.. తెరపై సందడి చేయనున్న పునీత్ వీడియో

స్టార్ హీరోను మళ్లీ బతికించారు.. తెరపై సందడి చేయనున్న పునీత్ వీడియో

Samatha J
|

Updated on: Oct 12, 2025 | 3:45 PM

Share

ఆధునిక AI టెక్నాలజీతో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ను తిరిగి తెరపైకి తీసుకొస్తున్నారు. మారీగల్లు అనే Zee5 ఒరిజినల్ OTT సిరీస్‌లో కదంబ రాజ్య రాజు మయూర వర్మ పాత్రలో పునీత్ రాజ్ కుమార్ ను AI సాయంతో చూపించనున్నారు. ఈ నెల 31 నుండి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్, భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలకు మార్గం సుగమం చేస్తుందని అంచనా.

ప్రస్తుతం టెక్నాలజీ అనూహ్య రీతిలో అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతాలు సృష్టిస్తూ, చనిపోయిన వారిని కూడా తెరపై సజీవంగా చూపించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇదే టెక్నాలజీని ఉపయోగించి, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ను మరోసారి అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమను చూరగొన్న పునీత్ రాజ్ కుమార్, 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణానంతరం జేమ్స్ చిత్రం, గంధద గుడి డాక్యుమెంటరీ విడుదలయ్యాయి. ఇప్పుడు, మారీగల్లు అనే ఓటీటీ సిరీస్ కోసం పునీత్ రాజ్ కుమార్ ను తిరిగి తెరపై చూపించనున్నారు. AI టెక్నాలజీ సహాయంతో కదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా ఈ సిరీస్‌లో పునీత్ కనిపించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో